ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Express train: బెంగళూరు నుంచి విజయవాడ వైపు నేడు అన్‌రిజర్వుడు ఎక్స్‌ప్రెస్‌ రైలు

ABN, First Publish Date - 2023-10-28T12:57:10+05:30

బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్‌ - భువనేశ్వర్‌ల మధ్య ప్రయోగాత్మకంగా ఆన్‌రిజర్వుడు ఎక్స్‌ప్రెస్‌ రైలును నడపనున్నారు. ఈ రైలులో ఎలాంటి రిజర్వేషన్లు,

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్‌ - భువనేశ్వర్‌ల మధ్య ప్రయోగాత్మకంగా ఆన్‌రిజర్వుడు ఎక్స్‌ప్రెస్‌ రైలును నడపనున్నారు. ఈ రైలులో ఎలాంటి రిజర్వేషన్లు, బెర్తులు ఉండవు. జనరల్‌ టికెట్‌తో ఏ బోగీలోనైనా ఎక్కి ప్రయాణించే వెసలుబాటు ఉంటుంది. 06287 ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ రైలు ఈ నెల 28న బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్‌ నుంచి తెల్లవారు జామున 3-30 గంటలకు బయల్దేరి వెళుతుంది. ఈ రైలు కంటోన్మెంట్‌, కృష్ణరాజపురం, బంగారపేట, జోలార్‌ పేట, కాట్పాడి, రేణిగుంట, గూడూరు(Renigunta, Gudur) మీదుగా విజయవాడకు అదే రోజు మధ్యాహ్నం 4.20కు చేరుకుంటుంది. అనంతరం ఈ రైలు రాజమండ్రి, దువ్వాడ పెందుర్తి, కొత్తవలస, శ్రీకాకుళం రోడ్‌(Kothavalasa, Srikakulam Road), పలాస, బ్రహ్మపుర, ఛత్రపుర, ఖుద్రారోడ్‌ల మీదుగా భువనేశ్వర్‌కు మరుసటి రోజు ఉదయం 5-40కు చేరుకుంటుంది. కాగా భువనేశ్వర్‌ నుంచి ఈ నెల 29న మరో ప్రత్యేక ఆన్‌రిజర్వుడు ఎక్స్‌ప్రెస్‌ రైలు 06288 ఉదయం 8.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.45కు ఎస్‌ఎంవిటి రైల్వేస్టేషన్‌కు చేరుకోనుంది. ఈరైలు కూడా ఇదే మార్గంలో ప్రయాణించనుంది. ఈ రెండు రైళ్ళలోనూ 21 జనరల్‌ సెకండ్‌క్లాస్‌ బోగీలు ఉంటాయని ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలో కోరారు. ఈ అన్‌రిజర్వుడు ఎక్స్‌ప్రెస్‌రైళ్ళకు స్పందన లభిస్తే వీటిని రెగ్యులర్‌గా నడిపే అంశాన్నిపరిశీలిస్తామని రైల్వే ప్రకటన పేర్కొంది.

Updated Date - 2023-10-28T12:57:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising