ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mathura fire: బాణసంచా దుకాణాలు అగ్నికి ఆహుతి...పలువురికి గాయాలు

ABN, First Publish Date - 2023-11-12T18:09:22+05:30

దీపావళి పండుగ వేళ ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఏర్పాటు చేసిన పలు బాణసంచా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.

మధుర: దీపావళి పండుగ వేళ ఉత్తరప్రదేశ్‌లోని మధుర (Mathura)లో ఏర్పాటు చేసిన పలు బాణసంచా దుకాణాలు (firecracker shops) అగ్నికి ఆహుతయ్యాయి. గోపాల్‌బాగ్ శివారు ఏరియాలో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయగా, అనూహ్యంగా మంటలు చెలరేగి ఏడు దుకాణాలకు వేగంగా మంటలు విస్తరించాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పలు వాహనాలు కూడా మంటల్లో దగ్దమయ్యాయి.


ఈ ఘటనపై రయ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ అజయ్ కిషోర్ మాట్లాడుతూ, గోపాల్‌బాగ్ ఏరియాలో బాణసంచా అమ్మకాల కోసం ఏర్పాటు చేసిన ఏడు దుకాణాలు మంటల్లో చిక్కుకున్నాయని, తొమ్మిది మంది గాయపడ్డారని చెప్పారు. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అనుమానిస్తున్నట్టు తెలిపారు. బాణసంచా దుకాణాలకు పర్మిట్ ఉందని చెప్పారు. ప్రమాదానికి కారణాలు, జరిగిన నష్టంపై విచారణ జరుపుతున్నామని అన్నారు.

Updated Date - 2023-11-12T18:09:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising