Benglore: డబుల్ డెక్కర్ రైల్లో మంటలు..
ABN, First Publish Date - 2023-07-13T15:27:28+05:30
కర్నాటక: బెంగళూరు నుంచి చెన్నై వెళ్లే డబుల్ డెక్కర్ రైల్లో ప్రమాదం జరిగింది. రైలు గుడియాత్తం స్టేషన్ చేరుకోగానే మంటలు వ్యాపించాయి. మంటలు, పొగలు గమనించిన రైల్వే సిబ్బంది రైలును స్టేషన్‌లో నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
కర్నాటక: బెంగళూరు (Benglore) నుంచి చెన్నై (Chennai) వెళ్లే డబుల్ డెక్కర్ రైల్లో (Double Decker Train) ప్రమాదం జరిగింది. రైలు గుడియాత్తం స్టేషన్ చేరుకోగానే మంటలు వ్యాపించాయి. మంటలు, పొగలు గమనించిన రైల్వే సిబ్బంది (Railway Staff) రైలును స్టేషన్‌లో నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైల్లో మంటలు వ్యాపించడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని టెన్షన్ పడ్డారు. గత కొద్ది రోజులుగా వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో భయపడ్డారు. అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తం కారణంగా పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
డబుల్ డెక్కర్ రైలు తమిళనాడు గుడియాత్తం రైల్వే స్టేషన్‌కు రాగానే ఇంజన్‌లో సాంకేతిక లోపం కారణంగా పొగలు వచ్చాయి. దీన్ని వెంటనే పైలట్ గుర్తించి.. రైలును నిలిపివేశారు. దాదాపు రెండు గంటలపాటు రైలును స్టేషన్‌లోనే నిలిపివేశారు. సాంకేతిక లోపాలను సరిచేసిన తర్వాత రైలు చెన్నైకు బయలుదేరింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Updated Date - 2023-07-13T15:27:28+05:30 IST