Encounter: జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్...ఐదుగురు మావోయిస్టుల హతం
ABN, First Publish Date - 2023-04-03T12:06:13+05:30
జార్ఖండ్ రాష్ట్రంలో సోమవారం పోలీసులు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది....
రాంచీ (జార్ఖండ్): జార్ఖండ్ రాష్ట్రంలో సోమవారం పోలీసులు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.(Five Naxals killed)ఛత్రా జిల్లా సమీపంలో పోలీసులకు,మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది.(Encounter in Chatra) ఇందులో ఇప్పటి వరకు ఐదుగురు నక్సలైట్లు హతమయ్యారు.(Jharkhand Police) అయితే దీనిపై అధికారికంగా ఏ అధికారి నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.పలాము-ఛత్ర సరిహద్దులో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. సీఆర్‌పీఎఫ్ కోబ్రా బెటాలియన్, జెఏపీ, ఐఆర్‌బితో పాటు పాలము, చత్ర జిల్లాల పోలీసు బలగాలు ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
ఇది కూడా చదవండి : Sonia Gandhi: రాహుల్ నివాసానికి వచ్చిన సోనియా, ప్రియాంక...జైలు శిక్షపై అప్పీల్
నక్సలైట్లకు సహకరించిన ఇతర వ్యక్తుల ఆచూకీ కోసం అడవిలో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు పోలీసులు రెండు ఏకే-47 రైఫిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అడవిలో మరికొన్ని ఆయుధాలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం మరికొందరు నక్సలైట్లకు కూడా బుల్లెట్ గాయాలైనట్లు సమాచారం. 25 లక్షల రివార్డుతో స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్ పాశ్వాన్ తన స్క్వాడ్‌తో ఎన్ కౌంటర్ స్థలంలో ఉన్నాడని సమాచారం.మరో ఇద్దరు నక్సలైట్లపై రూ.5 లక్షల రివార్డు ఉంది.
Updated Date - 2023-04-03T12:15:54+05:30 IST