Nirmala Sitaraman: జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ అంశంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
ABN, First Publish Date - 2023-02-15T18:43:22+05:30
పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు కేంద్ర సిద్ధమేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ..
న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ (GST) పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ (GST) కిందకు తెస్తామని బుధవారం తెలిపారు. పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (PHDCCI) సభ్యులతో 2023-24 బడ్జెట్ సమావేశానంతరం చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తేవడం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
మోదీ ప్రభుత్వం గత మూడు నాలుగేళ్లుగా దేశాభివృద్ధి కోసం ప్రభుత్వ వ్యయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీతారామన్ చెప్పారు. బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని 33 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు చేర్చామన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తేవడం, ఒక దేశం-ఒక రేషన కార్డు స్కీము అమలు కోసం రాష్ట్రాలతో కేంద్ర సంప్రదింపులు సాగిస్తోందన్నారు. సిమెంట్ ధరలు తగ్గించే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 18న జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. "జీఎస్‌టీ కౌన్సిల్ ఈనెల 18న సమావేశమవుతోంది. ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో సిమెంట్ ధరలు తగ్గింపుపై నిర్ణయం తీసుకునేందుకు జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశమవుతోందని జీబీఐసీ చైర్మన్ వివేక్ జోహ్రి గత వారం తెలిపారు.
Updated Date - 2023-02-15T19:17:47+05:30 IST