ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Former CM: ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయండి...

ABN, First Publish Date - 2023-09-21T11:38:30+05:30

శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రలోభాలతోనే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, తక్షణం ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలని జేడీఎస్‌

- ప్రలోభాలతోనే అధికారంలోకి వచ్చారు

- మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రలోభాలతోనే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, తక్షణం ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలని జేడీఎస్‌ డిమాండ్‌ చేసింది. రామనగర జిల్లాలోని చెన్నపట్టణలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి(Former Chief Minister HD Kumaraswamy) మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల సమయంలోనూ తాను పలుమార్లు ఓటర్లకు కాంగ్రెస్‌ రకరకాల కానుకలు పంచుతోందని ఆరోపించిన సంగతిని గుర్తు చేశారు. గ్యారెంటీ పథకాలు కూడా ప్రలోభాలకిందకే వస్తాయన్నారు. కాంగ్రెస్‌ ఉచిత పథకాల వలలో పడిన ప్రజలు ఏకపక్షంగా గెలిపించి 135 సీట్లు కట్టబెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు స్వయంగా సిద్దరామయ్య తనయుడు డాక్టర్‌ యతీంద్ర సైతం తమ ఆరోపణలకు బలం చేకూర్చేలా కుక్కర్లు, ఐరన్‌బాక్సులు, నాన్‌స్టిక్‌ పాన్‌లు పంచిపెట్టినట్టు అంగీకరించారని తెలిపారు.

ఈ అన్ని అంశాలను గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ పరిగణనలోకి తీసుకుని కేంద్రప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కోరారు. అధికారంలో కొనసాగే నైతిక హక్కు కాంగ్రెస్ కు ఎంతమాత్రం లేదన్నారు. గ్యారెంటీ పథకాలతో ఎల్లకాలం ఓటర్లను ఆకర్షించజాలరంటూ విరుచుకుపడ్డారు. గ్యారెంటీ పథకాలతోపాటు కాంగ్రెస్‌ అడ్డదారులు తొక్కి అధికారంలోకి వచ్చిందన్నారు. అనేకచోట్ల గిఫ్ట్‌ కూపన్‌లను పంచిపెట్టారని, వీటికి సంబంధించి తమవద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేస్తే ఈ ఆధారాలను సమర్పిస్తామన్నారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు దాదాపుగా ఖరారైనట్టేనని, ఆ పార్టీ అధిష్టానం సరైన సమయంలో నిర్ణయాన్ని ప్రకటిస్తుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-21T11:38:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising