ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Former CM: మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. వసూళ్లకు తెరలేపిన మంత్రులు

ABN, First Publish Date - 2023-08-05T13:00:18+05:30

సిద్దూ సర్కార్‌పై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. యూరప్‌ పర్యటన ముగించుకుని వచ్చిన మాజీ సీఎం, జేడీఎస్‌ నేత కుమారస్వామి

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): సిద్దూ సర్కార్‌పై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. యూరప్‌ పర్యటన ముగించుకుని వచ్చిన మాజీ సీఎం, జేడీఎస్‌ నేత కుమారస్వామి(Kumaraswamy) గురువారం రాత్రి పొద్దుపోయాక ఎయిర్‌పోర్ట్‌కు రాగానే ప్రభుత్వ అవినీతిపై మండిపడ్డారు. మరోసారి యతీంద్ర సిద్దరామయ్య ట్యాక్స్‌ (వైఎస్‏టీ) అంశాన్ని ప్రస్తావించారు. బీడీఏ ద్వారా కాంట్రాక్టర్ల నుంచి రూ.250 కోట్ల వసూళ్లకు అధికారులు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఓ మంత్రి సూచన మేరకే అధికారులు వసూళ్లకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. బ్రిటిష్‌ వారు ఈస్ట్‌ ఇండియా కంపెనీ వదిలిపోయినా కాంగ్రెస్‌ పార్టీ అదే అవినీతిని కొనసాగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో పర్సంటేజీలు శృతిమించాయన్నారు. ఇటీవల ఓ మంత్రిని కాంట్రాక్టర్లు కలిసేందుకు వెళ్లగా డబ్బులు ఉంటేనే లోపలికి రావాలని ఏజెంట్లు బహిరంగంగానే చెప్పారని పేర్కొన్నారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ అవినీతిని నియంత్రించాలని మంత్రులకు హితోపదేశం చేశారన్నారు. కానీ ఢిల్లీకి పంపాలనే బీడీఏ ద్వారా రూ.250 కోట్లు టార్గెట్‌ పెట్టారని, అవినీతి అక్రమాలు వీరు అరికట్టగలరా... అని ప్రశ్నించారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేసి ఒక్కరోజులోనే రద్దు చేశారని, ఇలా వ్యవహరిస్తే సామాన్యులకు రక్షణ సాధ్యమా అన్నారు. హోంశాఖలో వైఎస్టీ దందా తీవ్రమవుతోందని ఆరోపించారు.

బ్రిగేడ్‌ రోడ్డు సమీపంలోని గరుడామాల్‌ వద్ద ఉండే పోలీస్‌ మెస్‌లో జరిగిన భేటీలో సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah), హోంశాఖ మంత్రి పరమేశ్వర్‌, పోలీసు ఉన్నతాధికారులతోపాటు వైఎస్టీ సూత్రధారులు ఉన్నారని తెలిపారు. 36 మంది మంత్రులు ఢిల్లీలో అధిష్టానానికి రిపోర్టు కార్డు ఇచ్చేందుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. యూరప్‌ పర్యటనకు భార్య, పిల్లలు, అక్కచెల్లెళ్లతోపాటు వెళ్తే సింగపూర్‌లో కూర్చుని ప్రభుత్వం కూల్చేందుకు కుట్ర పన్నారంటూ డీసీఎం వదంతులు సృష్టించారని తెలిపారు. 19 స్థానాలు గెలిచిన తనను చూసి 135 మంది ఎమ్మెల్యేలు కల్గిన కాంగ్రెస్‌ పెద్దలకు అభద్రతా భావం వెంటాడుతోందన్నారు.

Updated Date - 2023-08-05T13:00:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising