ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

G20 Dinner : జీ20 సదస్సు.. రాష్ట్రపతి విందుకు ఖర్గేకు అందని ఆహ్వానం..

ABN, First Publish Date - 2023-09-08T12:28:40+05:30

జీ20 దేశాధినేతల గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఇస్తున్న విందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందలేదు. ఆయనకు కేబినెట్ మంత్రి హోదా ఉన్నప్పటికీ ఆయనను ఆహ్వానించలేదని ఆయన కార్యాలయం శుక్రవారం తెలిపింది.

Mallikharjun Kharge, Congress Chief

న్యూఢిల్లీ : జీ20 దేశాధినేతల గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఇస్తున్న విందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందలేదు. ఆయనకు కేబినెట్ మంత్రి హోదా ఉన్నప్పటికీ ఆయనను ఆహ్వానించలేదని ఆయన కార్యాలయం శుక్రవారం తెలిపింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను మాత్రమే ఈ విందుకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీల అధ్యక్షులను ఈ విందుకు ఆహ్వానించలేదని తెలుస్తోంది.

మాజీ ప్రధాన మంత్రులు దేవె గౌడ, మన్మోహన్ సింగ్‌లను ఈ విందుకు ఆహ్వానించారు. ఈ విందులో పాల్గొంటామని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తెలిపారు.

ఆహ్వానితులంతా శనివారం సాయంత్రం 5.45 గంటలకు పార్లమెంటు హౌస్ వద్ద అందుబాటులో ఉండాలని అధికారులు కోరారు. అక్కడి నుంచి భారత మండపం వద్దకు తీసుకెళ్లడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీవీఐపీల రాకపోకలు, ట్రాఫిక్ ఆంక్షల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.


జీ20 సదస్సు జరిగే భారత మండపం వద్దకు ఆహ్వానితుల వాహనాల శ్రేణులు వెళ్లడానికి అనుమతి లేదు. కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, ముఖ్యమంత్రులు, కార్యదర్శులు, ఇతర ప్రత్యేక అతిథులను తమ నివాసాల నుంచి పార్లమెంటు హౌస్‌కు తీసుకురావడం కోసం ఢిల్లీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ కాంప్లెక్స్‌లో భారత మండపాన్ని తీర్చిదిద్దారు. దీనిలోని మల్టీ ఫంక్షన్ హాలులో ఈ విందు ఏర్పాటైంది. అన్ని దేశాల నేతలకు ఈ వేదిక వద్ద ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలుకుతారు. వీరందరికీ మోదీ కూడా శనివారం వర్కింగ్ లంచ్ ఇస్తారు. మోదీ ఇక్కడికి శనివారం ఉదయం 9 గంటలకు చేరుకుంటారు.

దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రులు, విదేశాంగ మంత్రుల నేతృత్వంలో దాదాపు 40 బృందాలు రాబోతున్నాయి. సెక్రటరీ జనరల్ లేదా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేతృత్వంలోని వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా హాజరవుతారు. ఒక్కొక్క ప్రతినిధి బృందంలో 150 మంది నుంచి 200 మంది వరకు ప్రతినిధులు ఉంటారు. వీరితోపాటు భద్రతా సిబ్బంది, మీడియా ప్రతినిధులు, కేటరింగ్, ఇతర పనుల్లో పాల్గొనేవారు కూడా ఉంటారు. భారత మండపం వద్ద శనివారం మొత్తం మీద సుమారు 10,000 మంది పాల్గొంటారని జీ20 ఆపరేషన్స్ విభాగం ప్రత్యేక కార్యరద్శి ముక్తేష్ పర్దేశి చెప్పారు.


ఇవి కూడా చదవండి :

నగరంలో.. నాలుగు ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం

Sanatana Dharmam : సనాతన ధర్మంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - 2023-09-08T12:28:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising