ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Governor, Chief Minister: ‘మేకపిల్లకు గడ్డం ఎందుకు? - తమిళనాడుకు ఆర్‌ఎన్‌ రవి ఎందుకు?, గెటవుట్‌ రవి’

ABN, First Publish Date - 2023-04-09T12:17:19+05:30

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Governor RN Ravi and Chief Minister MK Stalin)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Governor RN Ravi and Chief Minister MK Stalin) ఎడమొహం... పెడమొహంగా కనిపించారు. విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికేందుకు వచ్చిన ఇరువురు... గౌరవ సూచకంగా పరస్పర అభివాదం చేసుకోవడం మినహా వారిద్దరి మధ్య మాటలు లేకపోయాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రధాని పర్యటనలో ఆద్యంతం ఇద్దరు నేతలు కనీసం ముఖం చూసుకున్న దాఖలాలు లేకపోయాయి. ముఖ్యమంత్రి ప్రధానితో సన్నిహితంగా మెలగ్గా, గవర్నర్‌ మాత్రం అంటీముట్టనట్లుగా వ్యవహరించడం గమనార్హం. ప్రధాని సైతం స్టాలిన్‌కు ఎనలేని ప్రాముఖ్యతనిచ్చారు. మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కొత్త టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధానికి అధికారులు భవన వివరాలను మ్యాప్‌ మూలంగా విశదీకరించారు. ఆ సమయంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు పలు సూచనలు చేసిన ప్రధాని.. ముఖ్యమంత్రి స్టాలిన్‌తో ఏదో నవ్వుతూ మాట్లాడారు. అనంతరం వారిద్దరూ చేతులు పట్టుకుని పరస్పరం అభినందించుకున్నారు. ఆ తరువాత చెన్నై సెంట్రల్‌లో వందే భారత్‌ రైలు(Vande Bharat Train) ప్రారంభోత్సవంలోనూ మోదీ-స్టాలిన్‌ ఎంతో ఆప్యాయంగా నడుచుకున్నారు. స్టాలిన్‌ చూపిన దిశగా మోదీ చేతులూపుతూ, రెండు చేతులెత్తి నమస్కరిస్తూ, ప్రజలకు అభివాదం చేశారు. ఆ తరువాత ఇరువురు నేతలు నవ్వుతూ మాట్లాడుకున్నారు. విమానాశ్రయ కొత్త టెర్మినల్‌, రైల్వేస్టేషన్‌లో వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవ సమయాల్లో ప్రధాని సీఎంను దగ్గరకు పిలిపించుకుని మరీ కార్యక్రమాలు పూర్తి చేశారు. వందేభారత్‌ రైలు డ్రైవర్‌ క్యాబిన్‌ వద్ద కూడా ప్రధాని, సీఎం, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఫొటో దిగారు. కానీ గవర్నర్‌ మాత్రం దూరంగానే ఉండిపోయారు. సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో బ్యాటరీ కారు ముందు వరుసలో ప్రధాని కూర్చోగా, ఆయన వరుసలో గవర్నర్‌, సీఎం కూర్చున్నారు.

కానీ కనీసం పలుకరించుకోలేదు. ఈ ఇద్దరి వైఖరి అన్ని కార్యక్రమాల్లోనూ చర్చనీయాంశమైంది. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్‌ఎన్‌ రవి, స్టాలిన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనికి తోడు ఆయన వద్ద 14 ఫైళ్లు పెండింగ్‌లో ఉండడం అన్ని వర్గాల్లో అసంతృప్తి రేపుతోంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టడం ప్రభుత్వవర్గాలకు కొరుకుడు పడడం లేదు. దీనికి తోడు ఆయన బహిరంగ వేదికలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వీటన్నింటికంటే ఇటీవల గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కూడన్‌కుళం అణువిద్యుత్‌ కేంద్రం, తూత్తుకుడిలో స్టెరిలైట్‌ పరిశ్రమలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన వారికి విదేశాల నుంచి నిధులు అందాయంటూ గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా డీఎంకే, దానిమిత్రపక్ష పార్టీల నేతలను తాకాయి. దీంతో సీఎం సహా, వివిధ పార్టీల నేతలు గవర్నర్‌పై దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో శనివారం ప్రధాని పర్యటన సందర్భంగా గవర్నర్‌, సీఎం సంయుక్తంగా వేదికలను పంచుకున్నా, అధికారిక గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం తప్ప, ఎక్కడా వారు పలుకరించుకోకపోవడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో ప్రధాని సైతం గవర్నర్‌ కన్నా ముఖ్యమంత్రితోనే ఎక్కువ సన్నిహితంగా వ్యవహరించడం బీజేపీ వర్గాలకు సైతం అంతుబట్టడం లేదు.

గవర్నర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు

స్థానిక అన్నాసాలైలో గవర్నర్‌కు వ్యతిరేకంగా పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. వాటిల్లో అన్నాదురై, స్టాలిన్‌, ఉదయనిధి ఫొటోలున్నాయి. అన్నాదురై ఫొటో కింద ‘ఎల్లలు కాపాడే అయ్యనార్‌’ అని ముద్రించారు. అదే విధంగా ‘‘మేకపిల్లకు గడ్డం ఎందుకు? - తమిళనాడుకు ఆర్‌ఎన్‌ రవి ఎందుకు?.. డిక్టేటర్‌ రవి.. గెటవుట్‌ రవి’’ వంటి వ్యాఖ్యలు ముద్రించి వున్నాయి. అర్ధరాత్రి పలుచోట్ల వెలసిన ఈ పోస్టర్లు సంచలనం రేపుతున్నాయి.

Updated Date - 2023-04-09T12:17:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising