ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Governor: ఆ మంత్రి వ్యవహారంపై ఇప్పుడు ఏం చేద్దాం?

ABN, First Publish Date - 2023-07-12T08:41:31+05:30

రాష్ట్ర మంత్రి సెంథిల్‌ బాలాజీ(Minister Senthil Balaji) వ్యవహారంపై గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) అటార్నీ జనరల్‌ వెంకటరమణితో మం

- అటార్నీ జనరల్‌తో గవర్నర్‌ భేటీ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి సెంథిల్‌ బాలాజీ(Minister Senthil Balaji) వ్యవహారంపై గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) అటార్నీ జనరల్‌ వెంకటరమణితో మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. మనీ ల్యాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేయడంతో రాష్ట్ర మంత్రివర్గం నుంచి సెంథిల్‌ బాలాజిని డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించిన గవర్నర్‌ రవి.. అంతలోనే మనసు మార్చుకుని ఆ ఉత్తర్వులను నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. అటార్నీ జనరల్‌ సూచనలు తీసుకోవాలన్న కేంద్ర హోంశాఖ సలహాతో ఆ ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్లు కూడా గవర్నర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏడు రోజుల పర్యటన కోసం ఇటీవల ఢిల్లీ వెళ్లిన రవి.. మంగళవారం అటార్నీ జనరల్‌తో అరగంటకు పైగా భేటీ అయ్యారు. సెంథిల్‌ బాలాజి వ్యవహారంపై మునుముందు ఏం చేయాలన్నదానిపై ఆయనతో చర్చించారు. అనంతరం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రాం మేఘవాల్‌తోనూ రవి భేటీ అయ్యారు. మంత్రిని డిస్మిస్‌ చేసే అధికారం తనకు ఉందోలేదోనన్న దానిపై స్పష్టత తీసుకున్న గవర్నర్‌.. భవిష్యత్తులో తాను తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2023-07-12T08:41:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising