ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Govt: ఎట్టకేలకు వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. దేనికోసమంటే..

ABN, First Publish Date - 2023-04-25T10:35:58+05:30

కార్మికుల పని సమయాన్ని 12 గంటలకు పెంచాలన్న నిర్ణయం నుంచి రాష్ట్రప్రభుత్వం వెనక్కి తగ్గింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కార్మికుల పని సమయాన్ని 12 గంటలకు పెంచాలన్న నిర్ణయం నుంచి రాష్ట్రప్రభుత్వం వెనక్కి తగ్గింది. శాసనసభలో ఆమోదించిన కార్మిక చట్ట సవరణ (చట్టం నెం.8/2023) ముసాయిదాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. ఈ సవరణ చట్టంపై కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో రాష్ట్రప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో కార్మిక చట్ట సవరణ బిల్లును ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రైవేటు కర్మాగారాల్లో 12 గంటల పని విధానం ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిన కార్మిక సంఘాలు మే 12న సమ్మెకు పిలుపునిచ్చాయి.

బిల్లు లేనట్టే...

కార్మిక చట్ట సవరణ ముసాయిదా బిల్లును నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రకటించారు. ఈ మేరకు సచివాల యం సోమవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా డీఎంకే పాలన సాగిస్తుందన్నారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చట్టాలు రూపొందించామన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, యువతకు ఉపాధి, తద్వారా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నా రు. ఆ క్రమంలో, కొన్ని కార్మిక సంఘాల సూచనలతో కొన్ని కర్మాగారాలకు మాత్రమే వర్తింపజేసేలా కార్మిక చట్ట సవరణ ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టామన్నారు. ఈ బిల్లును కార్మిక సంఘాలతో పాటు పలు పార్టీలు వ్యతిరేకించాయన్నారు. ఈ బిల్లుతో కార్మికులకు కలిగే ఇబ్బందులు పరిశీలించేందుకు కార్మిక సంఘాలతో చర్చలకు మంత్రులు ఏవీ వేలు, అన్బరసన్‌, గణేశన్‌(Ministers AV Velu, Anbarasan and Ganesan)లతో కమిటీ వేశామన్నారు. ఈ ముసాయిదా బిల్లుపై కార్మిక సంఘాలు తెలియజేసిన సూచనలు, సలహాలు, ఇబ్బందులను మంత్రుల కమిటీ తన దృష్టికి తీసుకొచ్చిందన్నారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న తమ ప్రభుత్వం ఈ ముసాయిదా బిల్లును నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు.

మంత్రుల బృందంతో చర్చలు...

కార్మిక చట్ట సవరణకు వ్యతిరేకత రావడంతో కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చించేందుకు మం త్రులు ఏవీ వేలు, టీఎం.అన్బరసన్‌, సీవీ గణేశన్‌లతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సోమవారం మధ్యాహ్నం గుర్తింపు పొందిన 12 కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపింది. చట్ట సవరణకు సంబంధించిన ప్రభుత్వ లక్ష్యాలను మంత్రుల కమిటీ వివరించగా,

ఈ చట్టంతో కార్మికులకు జరిగే నష్టాలను కార్మిక సంఘాల ప్రతినిధులు ఏకరువుపెట్టారు. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని అధికార డీఎంకే కార్మిక సంఘం సహా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌ సహా అన్ని కార్మిక సంఘాలు ఖండించాయి. దీంతో, కార్మిక సంఘాలు సూచించిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రుల కమిటీ కార్మిక సంఘాలకు హామీ ఇచ్చింది.

Updated Date - 2023-04-25T10:35:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising