ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India and France : భారత్, ఫ్రాన్స్ సంబంధాల్లో మహా విప్లవం

ABN, First Publish Date - 2023-07-15T11:17:12+05:30

భారత్-ఫ్రాన్స్ సంబంధాల్లో శుక్రవారం విప్లవాత్మక పరిణామం జరిగింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతమయ్యే విధంగా యుద్ధ విమానం ఇంజిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయబోతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మేక్రన్ ద్వైపాక్షిక చర్చల అనంతరం దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది.

Emmanuel Macron, Narendra Modi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పారిస్ : భారత్-ఫ్రాన్స్ సంబంధాల్లో శుక్రవారం విప్లవాత్మక పరిణామం జరిగింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతమయ్యే విధంగా యుద్ధ విమానం ఇంజిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయబోతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మేక్రన్ (French President Emmanuel Macron) ద్వైపాక్షిక చర్చల అనంతరం దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది.

భారత్-ఫ్రాన్స్ సంయుక్తంగా యుద్ధ విమానం ఇంజిన్‌ను అభివృద్ధి చేయడం కోసం ఫ్రెంచ్ ఏవియేషన్ కంపెనీ సాఫ్రాన్, భారత దేశానికి చెందిన రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ఈ ఏడాది చివరిలోగా ఓ ప్రణాళికను రూపొందిస్తాయి. ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ ప్రోగ్రామ్‌ (IMRH)లో భాగంగా ఫ్రాన్స్‌లోని సాఫ్రాన్ హెలికాప్టర్ ఇంజిన్‌తో కలిసి హెవీ లిఫ్ట్ హెలికాప్టర్స్ మోటరైజేషన్ కోసం పారిశ్రామిక సహకారాన్ని ఇరు దేశాలు పెంపొందించుకుంటాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), ఫ్రాన్స్‌లోని సాఫ్రాన్ హెలికాప్టర్ ఇంజిన్ మధ్య ఒప్పందం కుదిరింది. భారత్-ఫ్రాన్స్ మధ్య ఉన్న పరస్పర నమ్మకం స్ఫూర్తితో ఈ వెంచర్స్‌ను కుదుర్చుకున్నట్లు ఈ ప్రకటనలో తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం బదిలీలో ఇండో-ఫ్రాన్స్ అనుభవం ఆధారంగా క్రిటికల్ కాంపొనెంట్స్, టెక్నాలజీ బిల్డింగ్ బ్లాక్స్‌ను పంచుకోవడం, ఉమ్మడిగా అభివృద్ధి చేయడంలో ఇరు దేశాలకు పరస్పర విశ్వాసం ఉన్నట్లు తెలిపింది.

భారత దేశం 26 రఫేల్-ఎం నావల్ ఫైటర్ జెట్స్ కొనడం గురించి ఈ డాక్యుమెంట్‌లో వెల్లడించలేదు. కానీ భారత వైమానిక దళం కోసం భారత దేశం కొనుగోలు చేసిన 36 రఫేల్ యుద్ధ విమానాలను సకాలంలో భారత దేశానికి అందించడం గురించి మాత్రమే తెలిపింది.

మేక్రన్‌తో సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు మూల స్తంభం రక్షణ సంబంధాలేనని చెప్పారు. పరస్పర నమ్మకానికి ఇది చిహ్నమని చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్వయంసమృద్ధ భారత దేశం’ కార్యక్రమాల్లో ముఖ్యమైన భాగస్వామి ఫ్రాన్స్ అని తెలిపారు. జలాంతర్గాములైనా, నావికా దళ విమానాలైనా, తాము కలిసికట్టుగా అభివృద్ధి చేసి, అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నామని, కేవలం తమ అవసరాలు మాత్రమే కాకుండా మిత్ర దేశాల అవసరాలను కూడా తీర్చాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్-ఫ్రాన్స్ కలిసికట్టుగా పని చేస్తున్నాయన్నారు. క్రాస్ బోర్డర్ టెర్రరిజంపై కఠినంగా వ్యవహరించాలని తాము బలంగా విశ్వసిస్తున్నామన్నారు. భారత దేశ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌ను ఫ్రాన్స్‌లో ప్రారంభించడానికి ఇరు దేశాలు అంగీకరించాయన్నారు. మర్సీల్లీస్ నగరంలో కొత్తగా భారత కాన్సులేట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మోదీ ఈ నెల 13, 14 తేదీల్లో ఫ్రాన్స్‌లో పర్యటించారు. మోదీ, మేక్రన్ చర్చల అనంతరం సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోను మేక్రన్ ట్వీట్ చేశారు. దీనికి కేప్షన్‌ను ఫ్రెంచ్, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఇచ్చారు. ‘‘భారత్-ఫ్రెంచ్ భాగస్వామ్యం కలకాలం వర్ధిల్లాలి’’ అని శీర్షికను రాశారు. మోదీ దీనిని రీట్వీట్ చేసి, ‘‘ఎప్పటికీ స్నేహితులమే’’ అని తెలిపారు.

మోదీ శుక్రవారం ఫ్రాన్స్ బాస్టిల్లే డే ఉత్సవాల్లో గౌరవ అతిథిగా పాల్గొన్నారు. భారతీయ త్రివిధ దళాలు, భారత వాయు సేనకు చెందిన రఫేల్ ఫైటర్ జెట్స్ కూడా ఈ కవాతులో పాల్గొన్నాయి. మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్‌ను ప్రదానం చేశారు.

ఇవి కూడా చదవండి :

Price hike : ధరల పెరుగుదలకు కారణం మియా ముస్లింలే : హిమంత బిశ్వ శర్మ

Delhi Floods : యమునా నది శాంతిస్తోంది, కానీ ఢిల్లీ అవస్థలకు ఇంకా ఉపశమనం లేదు

Updated Date - 2023-07-15T11:17:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising