ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Azam Khan: మమ్మల్ని ఎన్‌కౌంటర్ చేస్తారేమో..?

ABN, First Publish Date - 2023-10-22T19:25:35+05:30

సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంను రాంపూర్ జైలు నుంచి అదివారం వేర్వేరు జైళ్లకు తరలించారు.జైలు నుంచి బయటకు వచ్చిన క్రమంలో ఆజం ఖాన్ మీడియాతో మాట్లాడుతూ. తనకు, తన కుమారుడికి ఏదైనా జరగవచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

రాంపూర్: నకిలీ బర్త్ సర్టిఫికెట్ల కేసులో ఏడైళ్ల జైలు శిక్షపడిన సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ (Azam Khan), ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజం (Abdullah Azam)ను రాంపూర్ జైలు నుంచి వేర్వేరు జైళ్లకు తరలించారు. వీరిద్దరితో పాటు ఆజం ఖాన్ భార్య తజిన్ ఫాతిమాకు కూడా ఏడేళ్ల జైలు శిక్ష పడడటంతో వీరిని ఈనెల 18న రాంపూర్ జైలుకు తరలించారు. అయితే, ఆదివారం ఉదయం ఆజం ఖాన్‌ను సీతపూర్ జైలుకు, ఆయన కుమారుడు అబ్దుల్లాను హర్దోయ్ జైలుకు తలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. తనకు, తన కుమారుడికి ఏదైనా జరగవచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ''మమ్మల్ని ఎన్‌కౌంటర్ చేస్తారేమో?'' అని వ్యాఖ్యానించారు.


రాంపూర్ జైలు నుంచి తరలించేటప్పుడు ఆజం ఖాన్ తొలుత పోలీసు వాహనం ఎక్కేందుకు నిరాకరించారు. అయితే పోలీసులు ఆయన నచ్చజెప్పడంతో ఆయన అందులో కూర్చున్నారు. కాగా, భద్రతా కారణాల రీత్యా వారిని వేర్వేరు జైళ్లకు తరలించినట్టు రాంపూర్ అడిషనల్ ఎస్‌పీ సన్సార్ సింగ్ తెలిపారు.

Updated Date - 2023-10-22T19:25:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising