PM Modi Birthday: ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ
ABN, First Publish Date - 2023-09-17T11:42:40+05:30
ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) 73వ పుట్టిన రోజు సందర్భంగా దేశ విదేశాల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సైతం ప్రధానికి బర్త్డే విషెస్ చెప్పారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన నాయకత్వంలో దేశం పురోగాభివృద్ధి సాధిస్తోందని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) 73వ పుట్టిన రోజు సందర్భంగా దేశ విదేశాల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధానికి బర్త్డే విషెస్ చెప్పారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన నాయకత్వంలో దేశం పురోగాభివృద్ధి సాధిస్తోందని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) సైతం విషెస్ చెబుతూ.. న్యూ ఇండియా ఆర్కిటెక్ట్ అని కొనియాడారు.
బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా మోదీ బర్త్డే (HappyBdayModiJi) సందర్భంగా శుభాకాంక్షలతో ముంచెత్తాయి. అమృతకాల్ గడియల్లో దేశ సమగ్రాభివృద్ధికి తమ నాయకత్వం ఎంత అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) పేర్కొన్నారు. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjuna Kharge), కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఎంపీ కిర్రోన్ ఖేర్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-09-17T11:55:18+05:30 IST