ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Haryana Violence : జలాభిషేక యాత్రపై దాడి.. పాకిస్థాన్ నినాదాలతో రెచ్చిపోయిన 800 మంది గుంపు..

ABN, First Publish Date - 2023-08-03T14:32:23+05:30

హర్యానాలోని నుహ్‌ జిల్లాలో సోమవారం జరిగిన హింసాత్మక ఘర్షణలపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక)లో దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. విశ్వ హిందూ పరిషత్, తదితర సంస్థల ఆధ్వర్యంలో సోమవారం జరిగిన జలాభిషేక యాత్రపై దుండగులు ఉద్దేశపూర్వకంగానే దాడి చేసినట్లు ఈ ఎఫ్ఐఆర్ తెలిపింది.

న్యూఢిల్లీ : హర్యానాలోని నుహ్‌ జిల్లాలో సోమవారం జరిగిన హింసాత్మక ఘర్షణలపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక)లో దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. విశ్వ హిందూ పరిషత్, తదితర సంస్థల ఆధ్వర్యంలో సోమవారం జరిగిన జలాభిషేక యాత్రపై దుండగులు ఉద్దేశపూర్వకంగానే దాడి చేసినట్లు ఈ ఎఫ్ఐఆర్ తెలిపింది. ఓ వర్గానికి చెందిన దాదాపు 800 నుంచి 900 మంది ‘‘పాకిస్థాన్ జిందాబాద్’’, ‘‘అల్లా హు అక్బర్’’ అనే నినాదాలు చేస్తూ, ఈ యాత్రలో పాల్గొన్న భక్తులపై దాడి చేసినట్లు పేర్కొంది.

ఈ ఎఫ్ఐఆర్‌లో తెలిపిన వివరాల ప్రకారం, జలాభిషేక యాత్ర సోమవారం నల్హర్‌లోని శివాలయం నుంచి ప్రారంభమైంది. ఈ శివాలయం పరిసరాల్లోని గుట్టలు, ఇళ్ల వద్ద నుంచి సుమారు 900 మంది దుండగులు ‘‘పాకిస్థాన్ జిందాబాద్’’, ‘‘అల్లా హు అక్బర్’’ అనే నినాదాలు చేస్తూ, ఈ శివాలయం వద్దకు చేరుకున్నారు. ఈ దుండగుల వద్ద కర్రలు, రాళ్లు, అక్రమాయుధాలు ఉన్నాయి. యాత్రలో పాల్గొన్న భక్తులను చంపాలనే ఉద్దేశంతో వీరంతా దాడులు చేశారు.

భక్తులపైనా, శివాలయంపైనా ఈ దుండగులు రాళ్లు, పెట్రోలు బాంబులు విసిరారు. వీరిని నిలువరించడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ, వీరు వెనుకంజ వేయలేదు. యాత్రలో పాల్గొన్న భక్తులపై దాడులను కొనసాగించారు. పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేస్తూ, అక్రమాయుధాలతో కాల్పులు జరిపారు. పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం ఈ దుండగులు వాహనాలను ధ్వంసం చేసి, తగులబెట్టారు.


ఈ యాత్రలో పాల్గొనడానికి వచ్చిన భక్తులు కార్లలో దాక్కుని కూర్చున్నట్లు కనిపిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి. లుఖ్మన్, వాజిద్, సాహిల్, ఝక్కర్, మరికొందరు ఈ హింసాకాండకు కుట్ర పన్నారు. పోలీసులపై కూడా పెట్రోలు బాంబులను విసిరారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.

ఈ మత ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 9.30 గంటల వరకు నాలుగు జిల్లాల్లో 83 కేసులను నమోదు చేసి, 165 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి :

Haryana clashes : హర్యానాలో మత ఘర్షణలు.. ప్రశాంతంగా ఉండాలన్న అమెరికా..

Gyanvapi : జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి

Updated Date - 2023-08-03T14:32:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising