Rain Alert : మరో 24 గంటలు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ABN, First Publish Date - 2023-07-10T12:38:23+05:30
వర్షాలు దేశాన్ని ముంచెత్తుతున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలను అలర్ట్ చేసింది. పలు రాష్ట్రాలను భారత వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.
ఢిల్లీ : వర్షాలు దేశాన్ని ముంచెత్తుతున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలను అలర్ట్ చేసింది. పలు రాష్ట్రాలను భారత వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ తెలిపింది. మరో 24 గంటల పాటు జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు ఐఎండీ ఆరంజ్ అలెర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లో 24 గంటల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. కాగా.. భారీ వర్షాల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు పలు సూచనలు చేశారు. 24 గంటల పాటు ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది.
Updated Date - 2023-07-10T12:38:23+05:30 IST