ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Poonch Terror Attack: ఉగ్ర దాడి నేపథ్యంలో జమ్మూకశ్మీరులో హై అలర్ట్

ABN, First Publish Date - 2023-04-21T07:24:05+05:30

జమ్మూకశ్మీరులోని ఫూంచ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి ఘటనతో హైఅలర్ట్ ప్రకటించారు....

Jammu & Kashmir High Alerts
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫూంచ్ : జమ్మూకశ్మీరులోని ఫూంచ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి ఘటనతో హైఅలర్ట్ ప్రకటించారు.(Poonch Terror Attack) కేంద్ర పారామిలటరీ బలగాలు ఎలాంటి కదలికలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని(High Alerts) కేంద్ర హోం మంత్రిత్వశాఖ కోరింది. జమ్మూలోని(Jammu & Kashmir) అంతర్జాతీయ సరిహద్దులతో పాటు, దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌, ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా, ఉరి సెక్టార్‌లలో కూడా ఉగ్రవాదులు పాక్ వైపు నుంచి తిరిగి చొరబడకుండా హై అలర్ట్ ప్రకటించారు.

ఉగ్రదాడికి పాల్పడింది పాకిస్థాన్ దేశానికి చెందిన సరిహద్దు యాక్షన్ టీం అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గతంలో రాజౌరి, పూంచ్ సెక్టార్లలో సైన్యం, పౌరులపై ఇదే విధంగా పాక్ దేశానికి చెందిన బార్డర్ యాక్షన్ టీం రెండు దాడులు జరిగాయని వారు తెలిపారు. ఈ దాడి అనంతరం భారత భద్రతా దళాలు మెంధార్ సబ్-డివిజన్‌లోని వివిధ గ్రామాల్లో భారీ కార్డన్ సాగిస్తున్నాయి.(Massive Search Operations)సైన్యం, పోలీసుల సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో గాలిస్తున్నారు. భారీగా బలగాలను మోహరించారు. భాటా ధురియన్, నార్ ఫారెస్ట్, సంజియోట్, కోటన్‌తో సహా పలు గ్రామాలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. సాయుధ పోలీసు పెట్రోలింగ్ ముమ్మరం చేశారు.

ఉగ్రదాడి తర్వాత భింబర్ గలి, భాటా ధురియన్ మధ్య జాతీయ రహదారిపై అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపివేశారు. భటా ధురియన్‌లో జరిగిన సంఘటన నేపథ్యంలో భింబర్ గలి నుంచి సురన్‌కోట్ రోడ్డు వరకు ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నట్లు పూంచ్ జిల్లా పోలీసులు తెలిపారు.కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీ20 సమావేశాలు జరగనున్న తరుణంలో ఈ దాడి జరిగింది.జి 20 సమావేశాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి గత వారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Updated Date - 2023-04-21T07:53:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising