Vande Sadharan: రంగంలోకి ‘వందే సాధారణ్’ రైళ్లు.. వైరల్ అవుతున్న వీడియో.. వీటి ప్రత్యేకతలివే!
ABN, First Publish Date - 2023-10-30T17:19:41+05:30
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా.. భారత ప్రభుత్వం సౌకర్యవంతమైన రైళ్లను ఒక్కొక్కటిగా రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు చెలామణీలోకి వచ్చేశాయి. అయితే..
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా.. భారత ప్రభుత్వం సౌకర్యవంతమైన రైళ్లను ఒక్కొక్కటిగా రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు చెలామణీలోకి వచ్చేశాయి. అయితే.. టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని వాదనలు వచ్చిన నేపథ్యంలో వందేభారత్‌లోనే మరో వర్షన్ రైళ్లను తీసుకురావాలని నిర్ణయించింది. అవే.. ‘వందే సాధారణ్’ రైళ్లు. డిసెంబర్ నాటికల్లా వీటిని ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఆల్రెడీ ట్రయల్ వర్షన్స్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ.. ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటే..
* సామాన్య ప్రజలకు సేవలందించే లక్ష్యంతో ఈ రైళ్లను తీసుకొస్తున్నారు. నాన్-ఏసీ స్లీపర్, నాన్-ఏసీ జనరల్ వర్షన్స్‌లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
* చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో ఈ వందేభారత్ సాధారణ్ రైళ్లను తయారు చేస్తున్నారు. స్లీపర్ వెర్షన్ దేశవ్యాప్తంగా 30 రూట్స్‌లో నడవనున్నాయి.
* ఈ నాన్-ఏసీ రైళ్లు పుష్-పుల్ మోడ్‌లో పని చేస్తాయి. ప్రతి చివర లోకోమోటివ్ ఉన్నా, లేకున్నా.. ఇరువైపుల నుండి రేక్‌లను నడపడానికి వీలు కల్పిస్తుంది.
* భారతీయ రైల్వే తన ఉత్పత్తి యూనిట్లలో 102 వందే భారత్ రేక్‌ల ఉత్పత్తి ప్రణాళికను విడుదల చేసింది. వీటిలో 75 రేక్‌లు చైర్ కార్ వెర్షన్‌గా, మిగిలినవి స్లీపర్ వెర్షన్‌గా ప్లాన్ చేయబడ్డాయి.
* భారతీయ రైల్వే.. మూడు విభిన్న సాంకేతికతలతో కూడిన వందేభారత్ రైళ్లలో 400 స్లీపర్ వెర్షన్‌ను తయారు చేయాలని కూడా యోచిస్తోంది.
ఈ రైళ్లలోనూ ప్రతి కోచ్‌లో బయో వాక్యూమ్ టాయిలెట్లు, ప్రయాణీకుల సమాచార వ్యవస్థ, ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్లు వంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. ప్రయాణికుల భద్రతను పటిష్టం చేసేందుకు ప్రతి కోచ్‌లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాదిరిగానే వందే సాధరణ్ రైలులో ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ ఉంటుంది. ఇక టికెట్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.
Updated Date - 2023-10-30T19:19:21+05:30 IST