ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heavy Rains: వరుణ బీభత్సం.. ఏకంగా 200% అధిక వర్షపాతం నమోదు.. ఎక్కడంటే..?

ABN, First Publish Date - 2023-07-12T11:30:33+05:30

భారీ వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్‌ (Himachal Pradesh Rains) అతలాకుతలం అవుతోంది. జూలైలోని మొదటి 10 రోజుల్లో ఏకంగా 200 శాతం అధిక వర్షపాతం (rainfall) నమోదైదంటేనే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హిమాచల్‌ప్రదేశ్‌లో జూలై 1 నుంచి 11 మధ్య 249.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ సాధారణ వర్షపాతం 76.6 మిల్లీ మీటర్లుగా ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారీ వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్‌ (Himachal Pradesh Rains) అతలాకుతలం అవుతోంది. జూలైలోని మొదటి 10 రోజుల్లో ఏకంగా 200 శాతం అధిక వర్షపాతం (rainfall) నమోదైదంటేనే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హిమాచల్‌ప్రదేశ్‌లో జూలై 1 నుంచి 11 మధ్య 249.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ సాధారణ వర్షపాతం 76.6 మిల్లీ మీటర్లుగా ఉంటుంది. దీంతో సాధారణం కన్నా 226 శాతం అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అత్యధికంగా కిన్నౌర్ జిల్లాలో 500 శాతం వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత సోలన్‌లో 426 శాతం, సిర్మౌర్‌లో 367 శాతం, సిమ్లాలో 360 శాతం, బిలాస్‌పూర్‌లో 325 శాతం, కులులో 283 శాతం అధిక వర్షాలు పడ్డాయి. ఇక లాహౌల్, స్పితిలో 233 శాతం, చంబాలో 220 శాతం, ఉనాలో 218 శాతం, హమీర్‌పూర్‌లో 171 శాతం, మండిలో 130 శాతం, కాంగ్రాలో 75 శాతం వర్షపాతం నమోదైంది.

వరుసగా 3 రోజులు దంచికొట్టిన వానలు మంగళవారం మాత్రం కాస్త శాంతించాయి. మంగళవారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలే కురిశాయి. అలాగే ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. ఉనా ప్రాంతంలో అత్యధికంగా 34.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గిరిజన ప్రాంతాలు, మరికొన్ని చోట్ల మినహా.. మిగతా అన్ని చోట్ల పగలు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని స్థానిక వాతారణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ‘ఎల్లో’ అలర్ట్‌ను కూడా జారీ చేసింది. నేటి నుంచి 17 వరకు హిమాచల్‌ప్రదేశ్‌లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Updated Date - 2023-07-12T11:30:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising