ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Himanta Biswa Sarma: కాంగ్రెస్ పార్టీని చంద్రుని పైకి పంపుతా, ఇవన్నీ పిల్ల చేష్టలు.. అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-09-16T15:01:51+05:30

పొలిటీషియన్లు ఎలాంటి రాజకీయాలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించడంపై దృష్టి సారించకుండా.. అనవసరమైన విషయాలపై లేనిపోని రాద్ధాంతం చేస్తుంటారు. తమ ప్రత్యర్థుల్ని..

పొలిటీషియన్లు ఎలాంటి రాజకీయాలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించడంపై దృష్టి సారించకుండా.. అనవసరమైన విషయాలపై లేనిపోని రాద్ధాంతం చేస్తుంటారు. తమ ప్రత్యర్థుల్ని తిప్పికొట్టడాన్ని, ప్రజల్లో వారిపై వ్యతిరేకత పెంచడానికి.. పొలిటీషియన్లు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తమ హయాంలో ఏదైనా ఒక మంచి పని జరిగితే చాలు.. దాన్నే అస్త్రంగా మార్చుకొని గొప్పలకు పోతుంటారు. ఇప్పుడు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సైతం అదే చేస్తున్నారు. ఇస్రో సాధించిన ‘చంద్రయాన్-3’ విజయాన్ని తన బీజేపీ విక్టరీ చెప్పుకుంటూ.. కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీని తాను చంద్రునిపైకి పంపుతానంటూ గట్టిగానే డప్పు కొట్టుకున్నారు.


అసలు మేటర్ ఏమిటంటే.. ఇటీవల నిర్వహించిన ఓ మీటింగ్‌లో ఇండియా కూటమి తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న న్యూస్ యాంకర్లను బాయ్‌కాట్ చేయాలని ఓ నిర్ణయం తీసుంది. దీనిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ.. ఇది పిల్లతనం అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, మీడియాపై మరిన్ని ఆంక్షలు విధిస్తుందని హెచ్చరించారు. ‘‘మీడియాను బాయ్‌కాట్ చేయడం, దానిపై సెన్సార్ విధించడం కొత్తదేమీ కాదు. 1975లోనూ ఇలాగే జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అప్పుడు మీడియాకు సెన్సార్ తప్పదు’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘సరైన సమయంలో ఇస్రో ‘చంద్రయాన్’ మిషన్‌ని విజయవంతం చేసింది. చంద్రునిపై ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు, నేను కాంగ్రెస్ పార్టీని చంద్రుని పైకి పంపుతా. మీడియాపై ఆంక్షలు విధించడం ఓ చైల్డిష్ విధానం’’ అని పేర్కొన్నారు.

ఇదిలావుండగా.. ఇండియా కూటమికి చెందిన ఓ సబ్-గ్రూప్ 14 మంది యాంకర్లను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ఒక జాబితాను విడుదల చేసింది. వీళ్లు ప్రతిపక్షంతో పాటు ద్వేషపూరిత ప్రసంగాల కవరేజీలో పక్షపాతం చూపించారని, అందుకే బహిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ లెక్కన.. ఇకపై ఈ యాంకర్ల షోలకు ఇండియా కూటమి తమ ప్రతినిధుల్ని పంపదు. అలాగే తమ పొలిటికల్ కార్యక్రమాలకు ఆ యాంకర్లను పిలవదు. మరోవైపు.. ప్రతిపక్షాలు ఎవరినీ బహిష్కరించలేదని, సమాజంలో విద్వేషాన్ని వ్యాప్తి చేసే వారిని మాత్రమే సహకరించకూడదని నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ మీడియా & పబ్లిసిటీ హెడ్ పవన్ ఖేరా తెలిపారు. దీనిని సహకార నిరాకరణ ఉద్యమంగా పేర్కొన్న ఆయన.. తాము చేస్తున్నది భారతదేశానికి మంచిది కాదని ఆ యాంకర్లు గ్రహిస్తే, మేము మళ్లీ వారి ప్రదర్శనలకు హాజరవుతామని పవన్ ఖేరా స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-16T15:01:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising