IAS and IPS officers: కర్ణాటక ఎన్నికల పరిశీలకులుగా 11 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులు
ABN, First Publish Date - 2023-05-02T11:51:54+05:30
కర్ణాటక(Karnataka) శాసనసభ ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్రానికి చెందిన 11 ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.
ఐసిఎఫ్(చెన్నై): కర్ణాటక(Karnataka) శాసనసభ ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్రానికి చెందిన 11 ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 10వ తేది జరుగనున్న పోలింగ్ జరుగనున్న ఈ ఎన్నికల ప్రచారం తీవ్రరూపం దాల్చింది. ఎన్నికల్లో నగదు బట్వాడా అడ్డుకొనేలా ఎన్నికల కమిషన్ పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్రం నుంచి ఎక్సైజ్ ఎస్పీ వరుణ్‌కుమార్ సహా ఇద్దరు ఐపీఎస్ అధికారులు, రాష్ట్ర ఖాదీ, గ్రామీణ బోర్డు అధ్యక్షుడు శంకర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ సంపత్, ఐఏఎస్ అధికారులు మలర్‌విళి, వీరరాఘవరావు, శోభన సహా 11 మంది ఐఏఎస్ అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఉత్తర కర్ణాటకలో ఐదుగురు, దక్షిణ కర్ణాటకలో ఆరుగురు అని 13 మంది పరిశీలకులుగా వ్యవహస్తున్నారు.
Updated Date - 2023-05-02T11:51:54+05:30 IST