ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bilawal Bhutto Vs Jaishankar : గెస్ట్ మంచివాడైతే, నేను మంచి హోస్ట్‌ను : ఎస్ జైశంకర్

ABN, First Publish Date - 2023-05-07T20:29:09+05:30

షాంఘై సహకార సంఘం (SCO) సమావేశాలకు హాజరైన పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ (Bilawal Bhutto Zardari) ప్రవర్తనను

Subrahmanian Jaishankar, Bilawal Bhutto
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైసూరు : షాంఘై సహకార సంఘం (SCO) సమావేశాలకు హాజరైన పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ (Bilawal Bhutto Zardari) ప్రవర్తనను మన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) తీవ్రంగా ఎండగట్టారు. అతిథి (Guest) మంచివాడైతే, తాను మంచి అతిథేయి (Host)ను అవుతానని చెప్పారు. భుట్టో మన దేశానికి వచ్చి, ఎస్‌సీఓ గురించి మాట్లాడకుండా ఇతర అంశాల గురించి మాట్లాడారని దుయ్యబట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విదేశాంగ విధానంపై మైసూరులో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఓ ప్రశ్నకు సమాధానంగా జైశంకర్ మాట్లాడుతూ, ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో పాల్గొనాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీని ఆహ్వానించామని చెప్పారు. అయితే ఈ సమావేశం బయట ఆయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను పరిశీలించినపుడు, ఆయన కేవలం భారత దేశం, జీ20, కశ్మీరు, బీబీసీ డాక్యుమెంటరీల గురించి మాత్రమే మాట్లాడారని, ఎస్‌సీఓ గురించి ఏమీ మాట్లాడలేదని చెప్పారు. ‘‘ఓ అతిథేయి (Host)గా నేనేం చేయాలి?’’ అని ప్రశ్నించారు. ‘‘నా దగ్గరకు మంచి అతిథి వస్తే, నేను మంచి అతిథేయిని. కానీ..’’ అన్నారు. ఆయన మాటలకు ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేశారు.

‘‘ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల సమావేశం ఉంది కాబట్టి పాకిస్థాన్ విదేశాంగ మంత్రిని ఆహ్వానించాం. బహుముఖ సమావేశాలు ఉంటే, ఆ అంశంపై చర్చించడానికి ఆహ్వానిస్తాం. ఆయన (బిలావల్)ను ఎస్‌సీఓకు సంబంధించిన అంశాలపై పాకిస్థాన్‌ ప్రతినిధి హోదాలో తన అభిప్రాయాలను చెప్పాలని ఆహ్వానించాం. మనం విభేదించుకోవచ్చు.. ఆయన అభిప్రాయం ఒకటి ఉండవచ్చు, నా అభిప్రాయం నాకు ఉండవచ్చు. చర్చించడానికి, విభేదించడానికి ఎస్‌సీఓ సమావేశ మందిరం ఉంది. అది ఓ విషయం’’ అని జైశంకర్ చెప్పారు.

ఉగ్రవాదాన్ని ఆయుధంగా మార్చుకోరాదని బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై ఎస్‌సీఓ సమావేశం తర్వాత జైశంకర్ స్పందించారు. ఉగ్రవాద బాధితులు, ఉగ్రవాదానికి పాల్పడేవారు ఒకే చోట కూర్చోకూడదన్నారు. దీనిపై బిలావల్ స్పందిస్తూ, జైశంకర్ కలవరపడ్డారన్నారు. పాకిస్థాన్ గురించి భారత దేశం బూటకపు ప్రచారం చేస్తోందని, తాను భారత్‌కు రావడంతో ఆ ప్రచారానికి విఘాతం కలిగిందని, అందుకే ఆయన కలవరపడ్డారని అన్నారు.

జైశంకర్ మాట్లాడుతూ, ‘‘ఉగ్రవాదాన్ని ఆయుధంగా మార్చుకోకూడదంటే అర్థం ఏమిటి మీ దృష్టిలో? అంటే బాధితునిగా నేను బాధను భరించాలా? అంటే మీరు ఉగ్రవాదానికి పాల్పడటం మాత్రమే కాకుండా, దాని గురించి మాట్లాడవద్దని కూడా చెబుతారా? ఆ దేశపు ఆలోచనా ధోరణి ఈ ఒక్క వాక్యంలోనే కనిపిస్తోంది. మీరంతా దీనిని చూడవచ్చు’’ అని చెప్పారు.

ఈ నెల 5న గోవాలో జరిగిన ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల సమావేశంలో బిలావల్ భుట్టో జర్దారీ పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Wrestlers Protest : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ రాజీనామా చేయాలి.. రెజ్లర్లకు రైతు నేతల మద్దతు..

Shashi Tharoor: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన: శశిథరూర్ డిమాండ్

Updated Date - 2023-05-07T20:29:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising