ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amit Shah: పాట్నాలో జరుగుతున్నది ఫోటో సెషన్...300 సీట్లు మావే

ABN, First Publish Date - 2023-06-23T13:41:20+05:30

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు విపక్షాలు పాట్నాలో సమావేశం కావడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఛలోక్తులు విసిరారు. పాట్నాలో ఒక ఫోటో సెషన్ జరుగుతోందని, వాళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఎన్డీయేను ఓడించాలని అనుకుంటున్నారని చెప్పారు. కానీ, 2024 ఎన్నికల్లో 300 సీట్లకు పైగా గెలుచుకోవడం ద్వారా నరేంద్ర మోదీ తిరిగి ప్రధాని అవుతారని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మూ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు విపక్షాలు పాట్నాలో సమావేశం కావడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Sha) ఛలోక్తులు విసిరారు. పాట్నాలో ఒక ఫోటో సెషన్ (Photo Session) జరుగుతోందని, వాళ్లు (opposition) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఎన్డీయేను ఓడించాలని అనుకుంటున్నారని చెప్పారు. కానీ, 2024 ఎన్నికల్లో 300 సీట్లకు పైగా గెలుచుకోవడం ద్వారా నరేంద్ర మోదీ తిరిగి ప్రధాని అవుతారనే విషయాన్ని వారికి తాను చెప్పదలచుకున్నానని అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని ప్రతి పౌరునికి రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తున్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నూతన కశ్మీర్ నిర్మాణం జరుగనుందని షా స్పష్టం చేశారు.

శ్యాం ప్రసాద్ ముఖర్జీ సేవలు చిరస్మరణీయం

జమ్మూలో ఒకరోజు పర్యటన కోసం అమిత్‌షా వచ్చారు. ఉదయమే జమ్మూ చేరుకున్న ఆయనకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా జమ్మూలోని బీజేపీ కార్యాలయానికి చేరుకుని, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దివంగత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆమిత్‌షా మాట్లాడుతూ, ఈరోజు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 'బలిదాన్ దివస్' అని, భారతదేశంలో ఇవాళ బెంగాల్ ఉందంటే అందుకు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీనే కారణమనే విషయం యావత్ దేశ ప్రజానీకానికి తెలుసునని అన్నారు. జమ్మూకశ్మీర్‌‌లో 370వ అధికారణనను ముఖర్జీ వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఒకే దేశంలో రెండు విధానాలు, ఇద్దరు ప్రధానులు కుదరదని ఆయన తెగేసి చెప్పేవారని అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని ప్రతి పౌరునికి రూ.5 లక్షల ఉచిత భీమా సౌకర్యం కల్పిస్తున్నామని, మోదీ నాయకత్వంలో నూతన కశ్మీర్ నిర్మాణం జరుగనుందని చెప్పారు.

Updated Date - 2023-06-23T13:41:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising