ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

INDIA bloc Meeting: సమోసా లేకుండా సరిపెట్టేశారు.. జేడీయూ ఎంపీ సెటైర్..

ABN, Publish Date - Dec 20 , 2023 | 08:14 PM

ఇండియా కూటమి నాలుగో సమావేశం విజయవంతమైనట్టు కూటమి నేతలు ఇప్పటికే ప్రకటించుకోగా, భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) ఎంపీ సునీల్ కుమార్ పింటూ మాత్రం బుధవారంనాడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ''సమోసా లేకుండా ఇండియా బ్లాక్ సమావేశం ముగిసింది'' అంటూ చమత్కరించారు. సమావేశంలో చెప్పుకోదగిన చర్చేమీ జరగలేదన్నారు.

న్యూఢిల్లీ: ఇండియా (I.N.D.I.A.) కూటమి నాలుగో సమావేశం విజయవంతమైనట్టు కూటమి నేతలు ఇప్పటికే ప్రకటించుకోగా, భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) ఎంపీ సునీల్ కుమార్ పింటూ(Sunil Kumar Pintu)మాత్రం బుధవారంనాడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ''సమోసా లేకుండా ఇండియా బ్లాక్ సమావేశం ముగిసింది'' అంటూ చమత్కరించారు. సమావేశంలో చెప్పుకోదగిన చర్చేమీ జరగలేదన్నారు.


''కూటమి సమావేశంలో సీట్ల షేరింగ్‌పై చర్చించాల్సి ఉంది. అయితే అది జరగలేదు. కూటమి పార్టీలకు చెందిన బడా నేతలందరూ వచ్చారు. అయితే చర్చనీయాంశంపైనే చర్చ జరుగలేదు. కాంగ్రెస్ పార్టీ టీ, బిస్కట్లకే పరిమితం చేసింది. ఎందుకంటే నిధుల కొరత ఉందని ఇటీవలే కాంగ్రెస్ చెప్పింది. రూ.138, రూ1,380, రూ.13,000 చొప్పున డొనేషన్లు కోరింది. ఇంకా డొనేషన్లు రాలేదు. అందువల్లే మంగళవారంనాడు జరిగిన సమావేశం సమోసా లేకుండా టీ, బిస్కట్లతో సరిపెట్టేశారు. ఏ సీరియస్ అంశంపైన చర్చ జరపకుండా ముగించేశారు'' అని సునీల్ కుమార్ పింటూ చెప్పారు.


సమావేశం అనంతరం ఖర్గే ఏం చెప్పారు?

కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాత్రం ఇండియా కూటమి సమావేశానంతరం పలు అంశాలపై సమావేశంలో చర్చించామని మీడియాకు చెప్పారు. ''అనేక అంశాలు చర్చించాం. సస్పెండ్ అయిన ఎంపీల అంశం వీటిలో ఒకటి. దీనిపై మేమంతా సమష్టిగా పోరాడతాం. డిసెంబర్ 22న దేశవ్యాప్త నిరసనకు కూడా నిర్ణయించాం'' అని చెప్పారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ సైతం, సీట్ల షేరింగ్‌పై చర్చలు ఎలాంటి జాప్యం లేకుండా తర్వలో ప్రారంభించాలని, సంయుక్త ర్యాలీలు నిర్వహించాలనే ప్రతిపాదనలు సమావేశంలో చేసినట్టు చెప్పారు.

Updated Date - Dec 20 , 2023 | 08:14 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising