ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India-Canada: ఖలీస్థానీ ఉగ్రవాది చిచ్చు.. కెనడా ఆరోపణలను ఖండించిన భారత్

ABN, First Publish Date - 2023-09-19T11:03:32+05:30

భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఖలీస్థానీ ఉగ్రవాదిని హతమార్చడంలో తమ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది.

భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఖలీస్థానీ ఉగ్రవాదిని హతమార్చడంలో తమ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. ఈ ఏడాది జూన్‌లో ఖలీస్థాన్ మద్దతారుడు, భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా గుర్తించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సర్రేలోని గురుద్వారా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చిచంపారు. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్ వేదికగా భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్యకు భారతదేశానికి సంబంధం ఉందని తమకు సమాచారం ఉందంటూ వ్యాఖ్యానించారు. తమ దేశ పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడాలోనే హత్య చేయడాన్ని తమ సార్వభౌమత్వంపై జరిగిన దాడిగా ఆయన చెప్పుకొచ్చారు. కెనడా విదేశాంగ మంత్రి కూడా భారత్‌పై ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా కెనడాలోని భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేశారు.


దీంతో కెనడా ఆరోపణలపై భారత్ స్పందించింది. కెనడా ఆరోపణలను ఖండిస్తూ భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘కెనడా ప్రధానమంత్రి వారి పార్లమెంటులో చేసిన ప్రకటనను, వారి విదేశాంగ మంత్రి ప్రకటనను కూడా మేము చూశాము. కెనడా ఆరోపణలను ఖండిస్తున్నాం. కెనడాలో జరిగిన హింసాత్మక చర్యలో భారత్ ప్రభుత్వం ప్రమేయం ఉందనే ఆరోపణలు అసంబద్ధమైనవి. మనది చట్టబద్ధమైన పాలన పట్ల బలమైన నిబద్ధత కలిగిన ప్రజాస్వామ్యం. ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు కెనడాలో ఆశ్రయం పొందిన ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తాయి. భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు తెస్తాయి. ఈ విషయంపై కెనడియన్ ప్రభుత్వం నిష్క్రియాత్మక వైఖరి చాలా కాలంగా నిరంతర ఆందోళనకు గురి చేస్తోంది. కెనడా రాజకీయ ప్రముఖులు బహిరంగంగా ఇలాంటి అంశాల పట్ల సానుభూతి వ్యక్తం చేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. హత్యలు, మానవ అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలతో సహా అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కెనడాలో స్థలం ఇవ్వడం కొత్తది కాదు. అటువంటి పరిణామాలకు భారత ప్రభుత్వాన్ని అనుసంధానించే ప్రయత్నాలను మేము తిరస్కరించాము. కెనడా ప్రభుత్వం తమ గడ్డపై పని చేస్తున్న అన్ని భారత్ వ్యతిరేక అంశాలకు వ్యతిరేకంగా సత్వర, సమర్థవంతమైన చట్టపరమైన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము.’’ అని పేర్కొంది.

Updated Date - 2023-09-19T11:03:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising