ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

London-Bengaluru flight : మళ్లీ ఎయిరిండియా విమానంలోనే... ఈసారి భారత సంతతి డాక్టర్ ఏం చేశారంటే...

ABN, First Publish Date - 2023-01-06T16:33:07+05:30

బాధితుని వయసు 43 ఏళ్లు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారం ఏదీ లేదు. ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో కేబిన్ సిబ్బంది

Dr Viswaraj Vemala
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : ‘వైద్యో నారాయణో హరిః’ అనే మాటను డాక్టర్ విశ్వరాజ్ వేమల (Dr Vishwaraj Vemala) నిజం చేశారు. విమాన ప్రయాణంలో రెండుసార్లు గుండెపోటుకు గురైన వ్యక్తిని కాపాడి తనలోని దైవత్వాన్ని ప్రదర్శించారు. బాధితుడిని స్పృహలోకి తీసుకురావడానికి ఆయన సుమారు ఓ గంట సేపు శ్రమించారు. లండన్ నుంచి బెంగళూరుకు వస్తున్న ఎయిరిండియా విమానంలో 10 గంటల ప్రయాణ కాలంలో ఆ రోగికి రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఈ వివరాలను యూనివర్సిటీ హాస్పిటల్స్ బర్మింగ్‌హామ్ ట్విటర్ వేదికగా వెల్లడించింది.

డాక్టర్ విశ్వరాజ్ వేమల భారతీయ మూలాలున్న వైద్యుడు. ఆయన యూనివర్సిటీ హాస్పిటల్స్ బర్మింగ్‌హామ్ ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్‌లో కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ (లివర్ డాక్టర్)గా పని చేస్తున్నారు. ఆయన తన తల్లితో కలిసి లండన్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా గత నవంబరులో ఈ సంఘటన జరిగింది. ఓ ప్రయాణికుడికి గుండెపోటు (cardiac arrest) వచ్చిందని, వైద్య సహాయం కావాలని కేబిన్ సిబ్బంది ప్రకటించారు.

బాధితుని వయసు 43 ఏళ్లు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారం ఏదీ లేదు. ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో కేబిన్ సిబ్బంది డాక్టర్ కోసం ప్రయత్నించారు. వెంటనే డాక్టర్ విశ్వరాజ్ వేమల స్పందించారు. బాధితుడి నాడి కొట్టుకోవడం లేదని, శ్వాస తీసుకోవడం లేదని గుర్తించారు. మందులేమైనా ఉన్నాయా? అని కేబిన్ సిబ్బందిని అడిగారు. అదృష్టవశాత్తూ విమానంలో ఎమర్జెన్సీ కిట్ ఉంది. ప్రాణాలను నిలిపే మందులు ఉన్నాయి. ఆక్సిజన్‌తోపాటు, ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ కూడా ఉంది. ఆయన ఏవిధంగా స్పందిస్తున్నదీ తెలుసుకునేందుకు ఇతర పరికరాలేవీ లేవు.

ఇతర ప్రయాణికుల సహాయంతో డాక్టర్ వేమల ఆ రోగి హార్ట్-రేట్ మానిటర్, బ్లడ్ ప్రెషర్ మిషన్, పల్స్ ఆక్సీమీటర్, గ్లూకోజ్ మీటర్‌లను నిరంతరం పరిశీలించారు. దాదాపు రెండు గంటలపాటు బాధితునికి సరైన పల్స్ రేట్, సరైన బ్లడ్ ప్రెషర్ లేదు. బాధితుడిని సుమారు ఐదు గంటల సేపు సజీవంగా ఉంచేందుకు కేబిన్ క్రూ, ఇతర ప్రయాణికులు చాలా శ్రమించారు. ఈ పరిస్థితి అందరికీ చాలా ఆందోళన కలిగించింది. అందరూ ఎంతో భావోద్వేగంతో కాలం గడిపారు.

బాధితుని పరిస్థితిపై తీవ్ర ఆందోళనతో విమానాన్ని పాకిస్థాన్‌లో దించేందుకు డాక్టర్ వేమల, విమానం పైలట్ ఆ దేశ అధికారుల అనుమతి కోరారు. కానీ ఫలితం లేకపోయింది. చివరికి ముంబై విమానాశ్రయంలో విమానాన్ని దించడానికి అనుమతి లభించింది. అంతేకాకుండా అక్కడ ఎమర్జెన్సీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ఎమర్జెన్సీ సిబ్బంది ఆ బాధితుడిని తీసుకెళ్లి, ఆయన ప్రాణాలను కాపాడారు.

డాక్టర్ వేమల మాట్లాడుతూ, ఈ సంఘటన తనతోపాటు ఇతర ప్రయాణికులకు, విమానం సిబ్బందికి చాలా భావోద్వేగంతో కూడుకున్నదని చెప్పారు. ముంబైలో దిగడానికి అవకాశం వచ్చినట్లు తెలియగానే తామంతా మరింత భావోద్వేగానికి గురయ్యామన్నారు. ముంబైలో విమానం దిగేసరికి బాధితుడు ఊపిరి తీసుకోగలిగారని, తనతో మాట్లాడగలిగారని చెప్పారు. అయినప్పటికీ ఆసుపత్రికి వెళ్ళవలసిందేనని తాను చెప్పానని తెలిపారు. బాధితుడు తనకు కన్నీళ్లతో ధన్యవాదాలు తెలిపారన్నారు. ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ సిబ్బంది సిద్ధంగా ఉండటంతో బాధితుడు సురక్షితంగా బయటపడగలిగారని చెప్పారు.

Updated Date - 2023-01-06T16:33:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising