Kharge: పాక్‌ను ఇందిర రెండుగా విడగొట్టారు.. ఆ విషయం మాట్లాడరేం..?: బీజేపీపై ఖర్గే ఫైర్
ABN, First Publish Date - 2023-08-13T19:29:04+05:30
కాంగ్రెస్ చేసిన పనులను ట్విస్ట్ చేసి తమవిగా చెప్పుకోవడం, ప్రజలను తప్పుదారి పట్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఛత్తీస్‌గఢ్ లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాల్లో ఆదివారంనాడు జరిగిన బహిరంగ ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, దేశానికి అవసరమైన వన్నీ కాంగ్రెస్ ఎప్పుడో చేసిందని అన్నారు.
జాంజిగిర్-చంపా: కాంగ్రెస్ చేసిన పనులను ట్విస్ట్ చేసి తమవిగా చెప్పుకోవడం, ప్రజలను తప్పుదారి పట్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాల్లో ఆదివారంనాడు జరిగిన బహిరంగ ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, దేశానికి అవసరమైన వన్నీ కాంగ్రెస్ ఎప్పుడో చేసిందని అన్నారు.
చైనా యుద్ధం గురించే కానీ, ఇందిర గురించి మాట్లాడరేం?
బీజేపీ ఎప్పుడూ 1962 చైనా యుద్ధం గురించే ప్రస్తావిస్తుందే కానీ, ఇందిరాగాంధీ పాకిస్థాన్‌ను రెండుగా విడగొట్టిన విషయం మరిచిపోయిందని ఆయన ఎద్దేవా చాశారు. బీజేపీ కనీసం ఒక పిట్టను కూడా కొట్టలేదన్నారు. పాకిస్థాన్‌ను ఇందిరాగాంధీ రెండుగా విడగొట్టిందని, ఇప్పుడు బంగ్లదేశ్‌లో ప్రజాస్వామి పాలన జరుగుతోందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే పొరుగుదేశానికి చెందిన లక్ష మందిని అరెస్టు చేసి, ఆ తర్వాత విడుదల చేసిందన్నారు. "మేము పాకిస్థాన్‌తో పోరాడి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించాం. అదీ కాంగ్రెస్ పవర్. మీరు కనీసం ఒక పిట్టని, లేదా ఎలుకను కూడా వేటాడలేదు'' అని బీజేపీపై ఖర్గే ఘాటు విమర్శ చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ''భరోసే కా సమ్మేళన్'' కార్యక్రమంలో ఖర్గే ఆదివారం పాల్గొన్నారు. గత అక్టోబర్‌లో ఏఐసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఖర్గే పర్యటించడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా ఖర్గేను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సన్మానించారు. ఈ ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో ఖర్గే పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Updated Date - 2023-08-13T20:06:51+05:30 IST