ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Stray Dogs Attack: అలీఘర్‌లో వీధికుక్కల దాడిలో 4 నెలల చిన్నారి మృతి, ఒక నెలలో రెండవ దాడి

ABN, First Publish Date - 2023-04-24T14:23:20+05:30

ఇంట్లోకి ప్రవేశించిన ఓ కుక్క గదిలో నిద్రిస్తున్న చిన్నారిని నోట కరచుకొని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరప్రదేశ్: అలీఘర్‌(Aligarh)లో వీధికుక్కల(Stray Dogs) దాడిలో రిటైర్డ్ డాక్టర్ మృతిచెందిన ఘటన మరువక ముందే ఓ చిన్నారిపై వీధికుక్కలు దాడి చేసి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్వర్ణ జయంతి నగర్ ప్రాంతంలో నాలుగు నెలల చిన్నారి(A Four-Month-Old Girl) ని వీధికుక్కలు కరిచి చంపాయి. ఇంట్లోకి ప్రవేశించిన ఓ కుక్క గదిలో నిద్రిస్తున్న చిన్నారిని నోట కరచుకొని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లింది. చిన్నారిపై అక్కడ ఉన్న అన్ని కుక్కలు దాడి చేసి శరీర భాగాలను చీల్చి తీవ్రంగా గాయపర్చాయి. దీంతో ఆ చిన్నారి మృతిచెందింది.

స్వర్ణ జయంతి నగర్(Swarna Jayanti Nagar) ప్రాంతంలో నివాసముంటున్న మృతిచెందిన చిన్నారి తల్లిదండ్రులు ఇంట్లో పెళ్లి వేడుకలో నిమగ్నమయ్యారు. చిన్నారిని ఓ గదిలో పడుకోబెట్టిన సమయంలో ఓ వీధికుక్క ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న పసికందును నోట కరుచుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లింది. దీంతోపాటు ఇతర కుక్కలు చేరి చిన్నారిని తీవ్రంగా గాయపర్చడంతో అక్కడికక్కడే మృతిచెందింది. గదిలో పసికందు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు చిన్నారి కోసం వెతికారు. వీధికుక్కల నుంచి చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందింది.

పసికందు తండ్రి పవన్ మాట్లాడుతూ.. ‘‘నా బిడ్డను వీధికుక్క ఎత్తుకెళ్లిందని తెలిసిన వెంటనే పరుగెత్తుకెళ్లి రక్షించేందుకు కుక్కలను తరిమికొట్టేందుకు ప్రయత్నించాను. అప్పటికే ఆలస్యం అయింది. వీధికుక్కలు నా బిడ్డను చంపేశాయి." అని బోరున విలపించారు.

ఇంతకుముందు కూడా చాలాసార్లు వీధికుక్కలు ఆ కుటుంబంపై దాడి చేశాయని మృతురాలి అమ్మమ్మ ఆశా తెలిపారు.

“అందరం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. కోడలు పాపతో సహా పిల్లలందరినీ ఇంట్లో పడుకోబెట్టింది. ఒక వీధి కుక్క ఇంట్లోకి ప్రవేశించి పసికందును ఎత్తెకెళ్లింది. మాకు విషయం తెలిసి వెళ్లేలోపే కుక్కలు పాపను చంపేశాయని’’ మృతిచెందిన చిన్నారి అమ్మమ్మ తెలిపింది.

Updated Date - 2023-04-24T14:24:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising