ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IRDAI : ఉద్యోగులకు సోషల్ మీడియా గైడ్‌లైన్స్.. బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ ఆదేశం..

ABN, First Publish Date - 2023-05-01T17:39:50+05:30

అన్ని బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ ఇన్ఫర్మేషన్ అండ్ సైబర్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్ పేరుతో విడుదల చేసిన ఈ మార్గదర్శకాల్లో సామాజిక మాధ్యమాలను

IRDAI
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో ఏ విధంగా వ్యవహరించాలో తెలియజేసే మార్గదర్శకాలను ఐఆర్‌డీఏఐ (Insurance Regulatory and Development Authority of India-IRDAI) జారీ చేసింది. కంపెనీ లేదా సంస్థకు సంబంధించిన రహస్య లేదా తనిఖీ చేయబడని సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజాబాహుళ్యానికి చేరకుండా నిరోధించేందుకు వీటిని అమలు చేయడం అవసరమని తెలిపింది. సంస్థ ప్రతిష్ఠకు, ఉద్యోగుల ప్రవర్తనకు చాలా సన్నిహిత సంబంధం ఉందని తెలిపింది. సంస్థ వ్యాపారానికి మరింత విలువ తీసుకొచ్చే విధంగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించాలని పేర్కొంది.

అన్ని బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ ఇన్ఫర్మేషన్ అండ్ సైబర్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్ పేరుతో విడుదల చేసిన ఈ మార్గదర్శకాల్లో సామాజిక మాధ్యమాలను ఆమోదయోగ్యంగా ఉపయోగించుకోవడంపై ప్రత్యేకంగా ఓ అధ్యాయం ఉంది. ఏదైనా బ్లాగ్/చాట్ ఫోరం/డిస్కషన్ ఫోరం/మెసెంజర్ సైట్/సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో వచ్చిన రహస్య లేదా తనిఖీ చేయబడని సమాచారాన్ని వ్యాపింపజేయవద్దని, ఇటువంటి సమాచారం విషయంలో సంయమనం పాటించాలని తెలిపింది.

ఎవరైనా ఉద్యోగి తన అధికారిక మెయిల్/వ్యక్తిగత మెయిల్/మీడియా ఫోరం లేదా ఇతర విధంగా ఏదైనా సమాచారాన్ని పొందినపుడు లేదా చూసినపుడు, దానిని ఏదైనా మీడియా ఫోరంలో షేర్ చేయాలని కానీ, వ్యాపింపజేయాలని కానీ ప్రతిపాదించినట్లయితే, దానిని తప్పనిసరిగా సంస్థ యొక్క కాంప్లియెన్స్ టీమ్, కార్పొరేట్ కమ్యూనికేషన్ టీమ్‌కు పంపించాలని, ముందుగా అనుమతి తీసుకోవాలని తెలిపింది.

సర్వీస్ లోపాన్ని తెలియజేయడానికి మీడియా ఫోరాలను వాడుకోరాదని తెలిపింది. ఫిర్యాదు చేయడానికి కూడా మీడియా ఫోరాలను వాడుకోవద్దని చెప్పింది. ఉద్యోగులు ఓ కంపెనీలో, సంస్థలో పని చేస్తున్నట్లు తెలియజేసే విధంగా వ్యక్తిగత ఇంటర్నెట్ పోస్టింగులు లేదా కమ్యూనికేషన్ జరిపితే, ‘‘ఈ సర్వీస్‌లో నేను చేసే పోస్టింగులు నా వ్యక్తిగత, సొంత అభిప్రాయాలు; అవి నా ఆర్గనైజేషన్‌కు సంబంధించినవి కాదు, ఆ విధంగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో చేసిన పోస్టింగులు కాదు’’ అని స్పష్టంగా కనిపించే విధంగా రాయాలని తెలిపింది.

సామాజిక మాధ్యమాల్లో చేసే వ్యక్తిగత ప్రచారం ఆ వ్యక్తి ప్రతిష్ఠను ప్రభావితం చేస్తుందని, అదేవిధంగా సంస్థ ప్రతిష్ఠను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. పర్సనల్ వెబ్‌సైట్స్‌లో లేదా, సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో సంస్థపై కానీ, దాని వ్యాపారంపై కానీ ఎటువంటి విమర్శలు, లేదా, వ్యాఖ్యలు పోస్ట్ చేయరాదని తెలిపింది.

సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఏవిధంగా పరిరక్షించాలో తెలిపింది. ఈ మార్గదర్శకాలను అమలు చేస్తే, ప్రమాదవశాత్తూ లేదా ఉద్దేశపూర్వకంగా సంస్థకు సంబంధించిన విషయాలు బయటకు వెల్లడికాకుండా, మార్పులు జరగకుండా, నాశనం కాకుండా, దుర్వినియోగం కాకుండా నిరోధించవచ్చునని తెలిపింది.

ఇవి కూడా చదవండి :

LPG cylinder prices : భారీగా తగ్గిన వంటగ్యాస్ ధరలు

Karnataka Polls : రైతులకు సున్నా వడ్డీకే రుణాలు.. పేదలకు ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు..

Updated Date - 2023-05-01T17:39:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising