ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Haryana Violence: ఇంటెలిజెన్స్ వైఫల్యమా? ప్రభుత్వ ఉదాసీనత కారణమా?

ABN, First Publish Date - 2023-08-02T17:52:59+05:30

రెండు నెలలకు పైగా ఘర్షణలతో మణిపూర్ అట్టుడుకుతున్న తరుణంలో హర్యానాలోని నుహ్‌ , గురుగ్రామ్లో హింసాకాండ చెలరేగడం, ఆరుగురు ప్రాణాలు కోల్పవడం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలను ఇంటెలిజెన్స్ ముందుగానే ఊహించలేకపోయిందనే అనుమానాలకూ తావిచ్చింది.

న్యూఢిల్లీ: రెండు నెలలకు పైగా ఘర్షణలతో మణిపూర్ అట్టుడుకుతున్న తరుణంలో హర్యానా (Haryana)లోని నుహ్‌ (Nuh), గురుగ్రామ్ (Gurugram)లో హింసాకాండ చెలరేగడం, ఆరుగురు ప్రాణాలు కోల్పవడం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలను ఇంటెలిజెన్స్ (Intelligence) ముందుగానే ఊహించలేకపోయిందనే అనుమానాలకూ తావిచ్చింది. అయితే, నుహ్, గురుగ్రామ్‌లో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ముందుగానే పసిగట్టాయట. ఇరువర్గాలు సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరికలు చేసుకున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిందని, అయితే అవాంఛనీయ పరిస్థితులను నివారించేందుకు తగినంత సంఖ్యలో పోలీసులను రాష్ట్ర యంత్రాగం మోహరించలేదని చెబుతున్నారు.


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వీహెచ్‌పీ చేపట్టిన బ్రిజ్ మండల్ జలాభిషేక్‌ యాత్రకు ముస్లిం వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి. గత ఫిబ్రవరిలో ఇద్దరు ముస్లిం యువకుల మృతదేహాలు భివానీ జిల్లాలో కనిపించడం, ఈ కేసులో గోసంరక్షణ కార్యకర్త మోను మనెసర్‌పై కేసు నమోదు చేసినప్పటి నుంచి ముస్లిం వర్గాలు గుర్రుగా ఉన్నాయి. జలాభిషేక్ యాత్రలో పెద్ద సంఖ్యలో జనం హాజరు కాగా, సుమారు 2,500 మంది అల్లరిమూక ఆలయంపై దాడిగి దిగిందని, కొన్ని దుకాణాలకు నిప్పు పెట్టిందని, మరికొన్ని దుకాణాలను లూటీ చేసిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఈ హింసాత్మక ఘటనలు చేటుచేసుకున్న కొద్ది గంటలకు ప్రభుత్వ యంత్రాంగం ఆ ప్రాంతానికి చేరినట్టు చెబుతున్నారు. కేవలం 700 మంది పోలీసు అధికారులు, అందులోనూ ఎక్కువ మంది హోం గార్డులు అక్కడకు చేరుకున్నారని, అల్లరిమూక హింసకు పాల్పడుతుంటే కొందరు పారిపోయే పనిలో పడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నుహ్ ఘటన జరిగిన సమయంలో మేవాత్ ఎస్పీ సెలవులో ఉండగా, పాల్వాల్ ఎస్‌పీకి అదనపు ఛార్జి అప్పగించడం మరో ఆసక్తికర అంశం. జిల్లాలకు తగినన్ని పోలీసు బలగాలను పంపినట్టు హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ చెబుతున్నప్పటికీ, అల్లర్లు జరిగిన ప్రాంతాలకు చేరేందుకు వారు ఎక్కువ సమయం తీసుకున్నారని తెలుస్తోంది.


ఇది ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యమే: మాజీ సీఎం

కాగా, నుహ్ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ) తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ మత ఘర్షణలను తగ్గించి చెప్పే ప్రయత్నం అధికారులు చేస్తున్నారని, శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని ఆరోపించాయి. ఘర్షణలు జరిగే అవకాశంపై సీఐడీ తగిన సమాచారం ఇచ్చినా, అడ్మినిస్ట్రేషన్ సమకాలంలో స్పందించలేదని, తగిన నిఘా ఉంచలేకపోయిందని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా తెలిపారు. ఇది ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యమేనని అన్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటనలు జరిగి ఉండేవి కావన్నారు. ఇది కేవలం సీఎం మనోహర్ ఖట్టార్ వ్యక్తిగత వైఫల్యం కాదని, అడ్మినిస్ట్రేటివ్ యంత్రాగం, మొత్తంగా ప్రభుత్వ వైఫల్యంగా చెప్పవచ్చని అన్నారు.


రెచ్చగొట్టే వీడియోలపై ఏడీజీపీ

కాగా, రెచ్చగొట్టే వీడియోలు పోలీసుల దృష్టికి వచ్చాయని, వెంటనే చర్యలు తీసుకున్నామని శాంతిభద్రతల విభాగం ఏడీజీపీ మమతా సింగ్ తెలిపారు. ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యంగా చెప్పరాదని, రెచ్చగొట్టే వీడియో షేర్ చేయడం, దానికి కౌంటర్ వీడియో షేర్ కావడంతో పోలీసులు తక్షణ చర్యలు తీసుకున్నారని, బలగాలను మోహరించారని చెప్పారు. అయితే, రెచ్చగొట్టే వీడియోలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు ముందస్తు అరెస్టులు, ఇంటర్నెట్ సేవలు ఎందుకు నిలిపివేయలేదని మరోసారి ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి.


అన్ని కోణాల నుంచి విచారణ: హోం మంత్రి

కాగా, హర్యానాలో జరిగిన అల్లర్లు అప్పటికప్పుడు జరిగినవి కావని, దేశంలోనూ, రాష్ట్రంలోనూ శాంతిని భంగం కలిగించేందుకు పన్నిన ముందస్తు వ్యూహమని హోం మంత్రి అనిల్ విజ్ ఆరోపించారు. అల్లర్లకు రాళ్లు, ఆయుధాలు సేకరించడం చూస్తే ఇది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇంతవరకూ 16 ఎఫ్ఐఆర్‌లు నమోదుచేశామని, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఈ అల్లర్లకు కారణం కావచ్చనే కోణం నుంచి కూడా విచారణ జరుపుతున్నామని చెప్పారు.

Updated Date - 2023-08-02T17:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising