Shah Vs Rahul: ఓబీసీ సెక్రటరీలపై రాహుల్‌కు అమిత్‌షా ఝలక్..!
ABN, First Publish Date - 2023-09-20T21:04:12+05:30
మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఓబీసీలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని, 99 మంది ప్రభుత్వ కార్యదర్శుల్లో ముగ్గురే ఓబీసీలు ఉన్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను హోం మంత్రి అమిత్‌షా తిప్పికొట్టారు. దేశాన్ని నడుపుతున్నది ప్రభుత్వమే కానీ, సెక్రటరీలు కాదంటూ ఘాటు సమాధానం ఇచ్చారు.
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill)పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఓబీసీలకు (OBC's) ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని, 99 మంది ప్రభుత్వ కార్యదర్శుల్లో ముగ్గురే ఓబీసీలు ఉన్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలను హోం మంత్రి అమిత్‌షా తిప్పికొట్టారు. దేశాన్ని నడుపుతున్నది ప్రభుత్వమే కానీ, సెక్రటరీలు కాదంటూ ఘాటు సమాధానం ఇచ్చారు.
బిల్లుపై చర్చలో అమిత్‌షా పాల్గొంటూ...''మా సహచరుడు ఒకరు (రాహుల్ గాంధీ) దేశాన్ని నడుపుతున్న వారిలో ముగ్గురే ఓసీలు ఉన్నారని చెప్పారు. ఆయనకు మేము అవగాహన కల్పించాలనుకుంటున్నాం. ఈ దేశాన్ని నడుపుతున్నది ప్రభుత్వమే కానీ కార్యదర్శులు కాదు'' అని అన్నారు. ఓబీసీల గురించి మాట్లాడుతున్న వారు ముందుగా ఒక విషయం తెలుసుకోవాలని, దేశానికి ఓబీసీ ప్రధానమంత్రిని బీజేపీనే ఇచ్చిందని అన్నారు. తమ పార్టీలో 29 శాతం ఎంపీలు ఓబీసీలేనని చెప్పారు. తమ పార్టీకి చెందిన 1,358 మంది ఎమ్మెల్యేలలో 365 మంది ఎంపీలు ఓబీసీ కేటగిరికి చెందిన వారున్నారని వివరించారు. కాగా, అమిత్‌షా చర్చలో పాల్గొన్నప్పుడు రాహుల్ సభలో లేరు.
Updated Date - 2023-09-20T21:05:40+05:30 IST