ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jacqueline Fernandez : సీబీఐ కోర్టుకు హాజరైన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

ABN, First Publish Date - 2023-04-05T11:24:24+05:30

సీబీఐ కోర్టుకు హాజరైన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నేడు హాజరైంది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసుపై సీబీఐ కోర్టు విచారణ నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ : సీబీఐ కోర్టుకు హాజరైన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నేడు హాజరైంది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసుపై సీబీఐ కోర్టు విచారణ నిర్వహించింది. నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌తో సంబంధాల నేపథ్యంలో కేసు నమోదైంది. రేపు అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక దాఖలు చేయాలని ఈడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 18కి వాయిదా వేసింది.

కాగా.. సుమారు రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరికీ రిలేషన్ ఉందని.. సుకేష్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకుందని గతంలో వార్తలు వచ్చాయి. ఈడీ అధికారులు సైతం దర్యాప్తు నిర్వహించి.. ఆమెను కూడా మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా చేర్చారు. పలుమార్లు జాక్వెలిన్ ఈడీ విచారణను సైతం ఎదుర్కొంది. ఈ కేసులో తనను కావాలని ఇరికించారని.. సుకేష్ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించింది. తన కెరీర్‌ని మొత్తం నాశనం చేశాడని వాపోయింది. నిజానికి సుకేష్ తనను హోం శాఖలో అధికారిగా పరిచయం చేసుకుని తనను తప్పుదారి పట్టించాడని ఆవేదన వ్యక్తం చేసింది. జైలులో ఉండి కూడా తనతో ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడే వాడని.. కానీ తాను జైల్లో విషయాన్ని మాత్రం తనకు తెలియనివ్వలేదని జాక్వెలిన్ వెల్లడించింది. మొత్తానికి తనను సంబంధం లేని కేసులో ఇరికించాడని తెలిపింది.

Updated Date - 2023-04-05T11:24:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising