ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jairam Ramesh: అమిత్‌షా బెదిరింపులను ఈసీ దృష్టికి తెస్తాం: జైరామ్ రమేష్

ABN, First Publish Date - 2023-04-26T17:00:27+05:30

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అల్లర్లు ఎక్కువవుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అల్లర్లు (Riots) ఎక్కువవుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) మంగళవారంనాడు బెళగవిలో జరిగిన ర్యాలీలో చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ (Jairam Ramesh) మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలను భయపట్టే విధంగా హోం మంత్రి చేసిన వ్యాఖ్యలను భారత ఎన్నికల కమిషన్ (ECI) దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగ బెళగవిలో అమిత్‌షా మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుటుంబ రాజకీయాలు పరాకాష్టకు చేరుతాయని, కర్ణాటకలో అల్లర్లు ఎక్కువవుతాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం బాట పడుతుందని విమర్శించారు. అమిత్‌షా వ్యాఖ్యలపై జైరామ్ రమష్ బుధవారంనాడు ఒక ట్వీట్‌లో మండిపడ్డారు. ''ఇది నిస్సందేహంగా భయపెట్టే ప్రకటనే. భారతదేశ తొలి హోం మంత్రి నిషేధించిన ఒక సంస్థకు చెందిన హోం మంత్రి ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి భయంతో ఎన్నికల ప్రచారంలో అల్లర్లు పేరుతో భయపెడుతున్నారు'' అని విమర్శించారు. అమిత్‌షా మాటలతో కర్ణాటకలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేపట్టిన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన తెలిపారు. ఇన్‌సల్ట్, ఇన్‌ఫ్లేమ్, ఇన్‌సైట్, ఇంటిమిడేట్ అనే ఫోర్-ఐ (4-I) వ్యూహంతో అమిత్‌షా ముందుకు వెళ్తున్నారని, ఇది సిగ్గుచేటైన వ్యవహారమని అన్నారు. దీనిపై ఈసీఐకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

కన్నడిగులను అవమానిస్తారా?: కాంగ్రెస్

కాగా, ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు మాత్రమే కర్ణాటక ఎన్నికలు పరిమితం కాదని, రాష్ట్ర భవితవ్యాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల్లో పెట్టేందుకు జరిగే ఎన్నికలని అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపైనా కాంగ్రెస్ మండిపడింది. ఆయన చేసి వ్యాఖ్యలు 6.5 కోట్ల కన్నడిగులను అవమానపరిచేలా ఉన్నాయని విమర్శించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10న జరుగనుండగా, మే 13న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-04-26T17:00:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising