ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jan Sangharsh Yatra : కర్ణాటక శాసన సభ ఎన్నికల నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాలి : సచిన్ పైలట్

ABN, First Publish Date - 2023-05-12T21:27:58+05:30

కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోందని, దీనికి కారణం బసవరాజ్ బొమ్మయ్ (Basavaraj Bommai) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ

Sachin Pilot
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోందని, దీనికి కారణం బసవరాజ్ బొమ్మయ్ (Basavaraj Bommai) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ అవినీతిని ప్రజలకు వివరించడమేనని రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) చెప్పారు. ఈ ఎన్నికల నుంచి కాంగ్రెస్ (Congress) పాఠాలు నేర్చుకోవాలన్నారు. రాజస్థాన్‌లో వసుంధర రాజే సింథియా నేతృత్వంలోని ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఆయన గురువారం నుంచి జన సంఘర్ష యాత్ర (Jan Sangharsh Yatra) చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అంతకుముందు వసుంధర రాజే సింథియా నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉండేది. ఆ బీజేపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దానిపై దర్యాప్తు జరిపించాలని సచిన్ పైలట్ తన పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్నే చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. అజ్మీర్ నుంచి జైపూర్ వరకు 125 కిలోమీటర్ల మేరకు జరిగే పాదయాత్రలో రెండో రోజైన శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

‘‘కర్ణాటకలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఈ విజయం వెనుక కారణం ఏమిటంటే, 40 శాతం కమిషన్ ప్రభుత్వం అని మనం ఆరోపించాం, ప్రజలు మనల్ని విశ్వసించారు. అందుకే కాంగ్రెస్ ఆధిక్యతను సాధించబోతోంది. రాజస్థాన్‌లో కూడా మనం ఇదే చెప్పాం. కానీ మన హామీపై చర్యలు తీసుకోవడంలో మనం విఫలమైతే, ప్రజల విశ్వాసాన్ని ఏ విధంగా పొందగలుగుతాం?’’ అని పైలట్ ప్రశ్నించారు.

తనకు ఎవరిపైనా శత్రుత్వం లేదన్నారు. తన ఆరోపణలు కక్ష సాధింపు కోసం కాదన్నారు. ఆరు నెలల్లో రాజస్థాన్ శాసన సభ ఎన్నికలు జరగబోతున్నాయని, ప్రజలకు మనం ఏం సమాధానం చెబుతామని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి :

Rajasthan: గెహ్లాట్‌కు ఆర్‍ఎస్ఎస్ ఫోబియా...బీజేపీ చీఫ్ ఫైర్..!

Karnataka election : ‘కింగ్‌మేకర్’ జేడీఎస్ సిద్ధం.. బీజేపీ, కాంగ్రెస్‌లకు సైగలు..

Updated Date - 2023-05-12T21:27:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising