ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jayalalitha: శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలితే

ABN, First Publish Date - 2023-04-25T10:56:49+05:30

పార్టీ నియమావళి ప్రకారం దివంగత ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha) మాత్రమే శాశ్వత ప్రధాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే నియమావళి ప్రకారం దివంగత ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha) మాత్రమే శాశ్వత ప్రధాన కార్యదర్శి అని తిరుచ్చిలో సోమవారం సాయంత్రం జరిగిన ఒ.పన్నీర్‌సెల్వం (O. Panneerselvam) వర్గం మహానాడు ప్రత్యేక తీర్మానం చేసింది. అన్నాడీఎంకేలో ఏకనాయత్వాన్ని వ్యతిరేకిస్తూ సుదీర్ఘ న్యాయపోరాటం సాగించి పార్టీలో పూర్తిగా పట్టుకోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి ఓపీఎస్‌(Former Chief Minister O.P.S) పార్టీ శ్రేణులంతా తనవైపేనంటూ బలప్రదర్శన దిశగా తిరుచ్చిలో మహానాడు నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు తిరుచ్చి పొన్‌మలై జీకార్నర్‌ మైదానంలో సోమవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎంజీఆర్‌, జయలలిత జయంతి వేడుకలు, అన్నాడీఎంకే 50వ ఆవిర్భావ వేడుకలు అంటూ త్రివిధ వేడుకలతో ఏర్పాటైన మహానాడులో వివిధ జిల్లాల నుంచి వందలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఓపీఎస్‌ వర్గం రాజకీయ సలహాదారు పన్రుట్టి రామచంద్రన్‌, మాజీ మంత్రులు వెల్లమండి నటరాజన్‌, సీనియర్‌ నాయకులు వైద్యలింగం, కేపి కృష్ణన్‌, మనోజ్‌ పాండ్యన్‌, అయ్యప్పన్‌, జేసీడీ ప్రభాకర్‌, తదితర నాయకులు హాజరయ్యారు. ఈ మహానాడులో మాజీ మంత్రి కేపీ కృష్ణన్‌ ఐదు తీర్మానాలను ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించి వాటిని సభికులకు చదివి వినిపించారు. ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) వర్గం నిర్వహించిన సర్వసభ్యమండలిలో ఓపీఎస్‌ పార్టీ సభ్యుడే కాదంటూ చేసిన నిర్ణయాన్ని రద్దు చేయాలని మొదటి తీర్మానం చేశారు. ఆ తర్వాత ఈపీఎస్‌ నాయకత్వంలో ఉన్న సర్వసభ్యమండలిని రద్దుచేయాలని, పారదర్శకమైన, న్యాయబద్ధమైన సర్వసభ్యమండలిని ఏర్పాటు చేయాలని, ఈపీఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుండి తప్పుకోవాలని, ఆయన నియమించిన నేతలు కూడా పదవులకు స్వస్తి చెప్పాలని మరికొన్ని తీర్మానాలు చేశారు.

Updated Date - 2023-04-25T10:56:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising