ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kamal Haasan: నటుడు కమల్‌హాసన్‌ సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-05-28T07:18:25+05:30

నూతన పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ఎందుకు రాకూడదో చెప్పాలని ‘మక్కల్‌నీది మయ్యం’ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): నూతన పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ఎందుకు రాకూడదో చెప్పాలని ‘మక్కల్‌నీది మయ్యం’ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌(Kamal Haasan) ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం దేశం మొత్తానికి సంబరాలు జరుపుకునే క్షణమని, ఇందుకు తానెంతో గర్వపడుతున్నానని వ్యాఖ్యానించారు. ఈ చారిత్రక విజయానికి భారత ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ జాతి గర్వంగా ఉప్పొంగాల్సిన ఈ క్షణం రాజకీయ విభజనగా మారిపోయిందన్నారు. అయితే ఈ పార్లమెంటు ప్రారంభో త్సవానికి రాష్ట్రపతి ఎందుకు రాకూడదో ప్రధాని చెప్పాలన్నారు. ఈ చారిత్రక ఘట్టానికి రాష్ట్రపతి ఎందుకు నేతృత్వం వహించకూడదన్నదానికి ఎలాంటి కారణం కనిపించడం లేదన్నారు. పార్లమెంటు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి ఆమోదించినప్పుడే చట్టంగా మారతాయని, పార్లమెంటు(Parliament) సమావేశాలను నిర్వహించే, లేదా వాయిదా వేసే అధికారం రాష్ట్రపతికి వుందన్నారు. అందుకే ఇప్పటికైనా సామరస్యపూర్వకమైన ధోరణితో ప్రధానమంత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించారు. ఈ పరిస్థితిని సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ఇది చరిత్రలో ఘోర తప్పిదంగా నిలిచిపోతుందని, సరిదిద్దితే రాజకీయ నాయకత్వంలో మైలురాయిగా మారు తుందని హితవు పలికారు. అదే విధంగా పార్లమెంటు ప్రారంభోత్సవ ఘట్టాన్ని బహిష్కరించాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. యావద్దేశంతో పాటు ప్రపంచం మొత్తం చూస్తున్న కొత్త పార్ల మెంటు ప్రారంభోత్సవ ఘట్టాన్ని జాతీయ సమైక్యత సందర్భంగా చేద్దామని, రాజకీయ విభేదాలన్నీ ఒక్కరోజు పక్కన పెడదామని కమల్‌ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-05-28T07:18:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising