ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kamal Haasan: విమర్శలు తర్వాత.. ముందు బాధితులకు సాయం చేద్దాం రండి

ABN, First Publish Date - 2023-12-09T08:44:14+05:30

రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో మిచౌంగ్‌ తుఫాను జల ప్రళయాన్ని సృష్టించి కోట్లాదిమంది ప్రజలకు కష్టాలు తెచ్చి

- కమల్‌ పిలుపు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో మిచౌంగ్‌ తుఫాను జల ప్రళయాన్ని సృష్టించి కోట్లాదిమంది ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టిందని, ఈ సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం కంటే బాధితులకు సాయం చేయడమే మంచిదని మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు కమల్‏హాసన్‌(Movie actor Kamal Haasan) హితవు పలికారు. స్థానిక ఆళ్వార్‌పేటలోని పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం వరద బాధితులకు సహాయాల పంపిణీకి ఆయన శ్రీకారం చుట్టారు. వరద బాధితులను సహాయాలు తీసుకెళ్తున్న వ్యాన్లకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నగరంలో మునుపెన్నడూ లేని విధంగా కుం డపోతగా వర్షం కురిసిందని, మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో 24గంటల వ్యవధిలో 56 సెం.మీల మేరకు వర్షపాతం నమోదై జలవిలయాన్ని సృష్టించిందన్నారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మన అవసరాలను మనమే తీర్చుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం కన్నా వరదబాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం మంచిదన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పునరావాస చర్యలన్నీ పూర్తయిన తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చునని, ప్రస్తుతం క్షేత్ర పరిశీలనకు వెళ్ళి బాధితులను ఆదుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. తుఫాను బాధితులను ఆదుకునే దిశగా తమపార్టీ ఆధ్వర్యంలో ఐదువేల మందికి సహాయాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

బాధితులకు ఆహారం పంపిణీ

వేళచ్చేరిలో భారీ వంటశాలను ఏర్పాటు చేసి ప్రతిరోజూ ఆహారం తయారు చేసి వరద బాధితులకు పంపిణీ చేయనున్నామని తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు పార్టీ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనున్నామని కమల్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మక్కల్‌ నీదిమయ్యం ఉపాధ్యక్షుడు మౌర్యా, ప్రధాన కార్యదర్శి అరుణాచలం, పార్టీ ప్రముఖులు సెంథిల్‌ ఆర్ముగం, మురళిఅబ్బాస్‌, ప్రముఖ సినీ గేయ రచయిత స్నేహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-09T08:44:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising