Kamal Haasan: లోక్‌సభ ఎన్నికల్లో ఏం హామీలు ఇమ్మంటారు?
ABN, First Publish Date - 2023-07-26T08:26:48+05:30
వచ్చే యేడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ‘మక్కల్ నీది మయ్యం’ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజాభిప్రాయాలకు అను గుణంగా రూపొదించా
- ఎంఎన్‌ఎం ప్రజాభిప్రాయ సేకరణ
చెన్నై, (ఆంధ్రజ్యోతి): వచ్చే యేడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ‘మక్కల్ నీది మయ్యం’ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజాభిప్రాయాలకు అను గుణంగా రూపొదించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆ పార్టీకి 114 మంది జిల్లా కార్యదర్శులు ఉన్నారు. పార్టీని పటిష్ఠం చేసే దిశగా 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జీలను నియమించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్(Kamal Haasan) పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ‘మక్కలోడు మయ్యం’ (ప్రజలతో పార్టీ) పేరుతో ఎలాంటి ఎన్నికల హామీలను ప్రకటించాలో పార్టీ జిల్లా శాఖల నాయకులు ప్రజల నుంచిఅభిప్రా యాలను సేకరించాలని కమల్‌హాసన్ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, ఉచిత పథకాలకు సంబంధించిన 15 ప్రశ్నలు కలిగిన కరపత్రాలను పంపిణీ చేసి వాటికి సమాధానాలను ప్రజల నుంచి రాబడుతున్నారు. ప్రస్తుతం దక్షిణ చెన్నై, కోయంబత్తూరు, మదురై(South Chennai, Coimbatore, Madurai) లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
కోయంబత్తూరులో మక్కల్‌నీది మయ్యం ఉపాధ్యక్షుడు తంగవేల్, కార్యదర్శి అర్జునన్ తదితరులు ప్రజాభిప్రాయాల్ని సేకరించారు. ఎలాంటి హామీలను ప్రజలు కోరుకుంటున్నారనే వివరాలను ఆయా జిల్లా శాఖల కార్యదర్శులు ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌కు ఈ మెయిల్, వాట్సప్ సందేశాల ద్వారా తెలియజేస్తున్నారు.ఈ అభిప్రాయ సేకరణ సుమారు రెండు నెలలపాటు అన్ని లోక్‌సభనియోజకవర్గాల్లో నిర్వహించనున్నట్లు ఆపార్టీ నేత ఒకరు తెలిపారు.
Updated Date - 2023-07-26T08:26:48+05:30 IST