ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Karnataka:కర్ణాటక బంద్ ప్రభావం.. రేపు(సెప్టెంబర్ 29)న బెంగళూరులో స్కూళ్లకు సెలవు

ABN, First Publish Date - 2023-09-28T21:47:10+05:30

తమిళనాడు(Tamilnadu)కు కావేరీ జలాల్ని(Kaveri River) విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక(Karnataka) వ్యాప్తంగా ఆ ప్రాంత ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 29న బెంగళూరు బంద్(Bengaluru) కు పిలుపునిచ్చారు. ఆ రోజు రాజధానిలోని అన్ని బడులకు సెలవులు ప్రకటించారు.

బెంగళూరు: తమిళనాడు(Tamilnadu)కు కావేరీ జలాల్ని(Kaveri River) విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక(Karnataka) వ్యాప్తంగా ఆ ప్రాంత ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 29న బెంగళూరు బంద్(Bengaluru) కు పిలుపునిచ్చారు. ఆ రోజు రాజధానిలోని అన్ని బడులకు సెలవులు ప్రకటించారు. కర్ణాటక రక్షణ వేదిక, కన్నడ చలవలి, కన్నడ ఒక్కట.. రేపు ఉదయం నుంచి నిరసనలు తెలపాలని పిలుపునిచ్చింది. బంద్ కారణంగా రవాణాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కర్ణాటక నుండి తమిళనాడుకు యథావిధిగా బస్సులు నడుస్తాయని చెప్పారు. నగరంలోని టౌన్ హాల్ నుంచి ఫ్రీడం పార్క్ వరకు భారీ నిరసన ప్రదర్శన ఉంటుందని, ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.


కర్ణాటకలోని హోటళ్లు, ఆటోరిక్షాలు, హెల్ రైడర్స్ అసోసియేషన్‌లతో పాటు ప్రతిపక్ష బీజేపీ(BJP), జేడీ(ఎస్) బంద్‌కు మద్దతు ప్రకటించాయి. ఆటోరిక్షా డ్రైవర్స్ యూనియన్, ఓలా ఉబర్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ (OUDOA) బంద్‌కు మద్దతు ఇస్తున్నాయి. బంద్‌కు తాము నైతిక మద్దతు ఇస్తున్నామని కర్ణాటక స్టేట్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ తెలిపారు. కాగా, రాష్ట్ర రవాణా శాఖ తమ సర్వీసులను యథావిధిగా కొనసాగించాలని సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. బళ్లారి, కలబురగి, బీదర్, బాగల్‌కోట్, విజయపుర, యాద్గిర్, హుబ్బళ్లి-ధార్వాడ్, గడగ్, హావేరి, కొప్పల్, దావణగెరె వంటి ఉత్తర కర్ణాటకలోని రైతులు, వ్యాపారులు బంద్‌కు సంపూర్ణ మద్దతునిచ్చారు.

తమిళనాడు పోలీసుల ముందస్తు జాగ్రత్తలు...

కర్ణాటక బంద్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తమిళనాడు డీజీపీ(DGP) శంకర్ జివాల్ సరిహద్దు జిల్లాలైన కృష్ణగిరి, ధర్మపురి, సేలం, ఈరోడ్, నీలగిరి జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లను ఆదేశించారు. సీనియర్ అధికారుల నేతృత్వంలో చెక్‌పోస్టుల వద్ద భద్రతను పెంచాలని సూచించారు.

Updated Date - 2023-09-28T21:49:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising