ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Elections 2023: బీజేపీ ఆశలన్నీ మోదీపైనే.. కర్ణాటకలో బీజేపీ గెలవాలంటే..

ABN, First Publish Date - 2023-02-26T12:48:02+05:30

శాసనసభ ఎన్నికల నగారా ఏప్రిల్‌లో మోగే అవకాశాలు కనిపిస్తుండడంతో ఈలోపు అధికార బీజేపీ చకచకా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగానే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల (Karnataka Assembly Elections 2023) నగారా ఏప్రిల్‌లో మోగే అవకాశాలు కనిపిస్తుండడంతో ఈలోపు అధికార బీజేపీ (BJP) చకచకా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Modi) రాష్ట్రంలో ఈనెల 27 నుంచి వరుస పర్యటనల్లో పాల్గొననున్నారు. ప్రధాని 27న ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఉదయం 11.35 గంటలకు శివమొగ్గ నూతన విమానాశ్రయానికి చేరుకుంటారు. శివమొగ్గ ఎయిర్‌పోర్ట్‌ నూతన టర్మినల్‌ను తిలకిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి బెళగావి విమానాశ్రయం ద్వారా ఢిల్లీకి బయల్దేరుతారు. ప్రధాని పర్యటన (Modi Karnataka Tour) ద్వారా శివమొగ్గ చుట్టుపక్కల జిల్లాల్లో పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. 650 ఎకరాల్లో నిర్మించిన ఈ విమానాశ్రయం వల్ల చిక్కమగళూరు, దావణగెరె, చిత్రదుర్గ జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరనున్న సంగతి తెలిసిందే. ప్రధాని సభకు కనీసం రెండు లక్షల మందిని సమీకరించేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

శివమొగ్గ జిల్లా (Shivamogga District) ఎంపీ, యడియూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్రతో పాటు ఆయన మరో కుమారుడు, రాష్ట్ర బీజేపీ మోర్చాల సమన్వయ కమిటీ కన్వీనర్‌ బీవై విజయేంద్ర కూడా దగ్గరుండి మరీ ప్రధాని సభను విజయవంతం చేసే సన్నాహాలు చేస్తున్నారు. శివమొగ్గలో కార్యక్రమం ముగిసిన అనంతరం బెళగావికి రానున్న మోదీ 8 కిలోమీటర్ల మేర భారీ రోడ్‌షోలో పాల్గొంటారు. ఈ రోడ్‌ షో సాగే మార్గాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని రోడ్‌ షోతో బెళగావి జిల్లాలో బీజేపీ కార్యకర్తల్లో ఎన్నికల కదనోత్సాహం ఏర్పడుతుందని పార్టీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. మొత్తానికి 27న ప్రధాని పాల్గొననున్న కార్యక్రమాలతో ఐదారు జిల్లాల్లో పార్టీకి రాజకీయ లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర నేతలు అంచనా వేస్తున్నారు. ప్రధాని పాల్గొంటున్న శివమొగ్గ, బెళగావి పర్యటనలు పూర్తిగా అధికారికమైనవే అయినప్పటికీ బీజేపీ తనదైన శైలిలో గరిష్ట ప్రయోజనం పొందే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉంది. కాగా ప్రధాని నరేంద్రమోదీ మార్చి 11న మరోసారి బెంగళూరు నగరానికి రానున్నారు.

బెంగళూరు - మైసూరు నగరాల మధ్య నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌ హైవేను ప్రారంభించనుండడంతోపాటు మద్దూరులో జరిగే బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బిడది నుంచి మద్దూరు వరకు జరిగే భారీ రోడ్‌షోలో ప్రధాని పాల్గొంటారు. ఈ రోడ్‌షో కూడా ఐదు కిలోమీటర్లకు పైగా సాగనుంది. ప్రధాని సమావేశానికి కనీసం రెండు లక్షల మందిని తరలించాలని బీజేపీ రామనగర, మండ్య జిల్లాల నేతలు నిర్ణయించారు. ఈ ఏర్పాట్లను స్వయంగా మంత్రులు డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ, కే గోపాలయ్య పర్యవేక్షిస్తున్నారు. మద్దూరు సమావేశం అనంతరం ప్రధాని ధారవాడలో ఐఐటీ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

ప్రధానికి అందుబాటులో ఉండే సమయాన్ని బట్టి ఇక్కడ కూడా ఓ భారీ బహిరంగసభను ఏర్పాటు చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. కాగా ప్రధాని మార్చి 25న మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తారు. పార్టీ ఆధ్వర్యంలో 20 రోజులపాటు జరిగే జనసంకల్ప యాత్రల ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ దావణగెరెలో ప్రసంగించే మెగా ర్యాలీకి కనీసం 5 లక్షల మంది ప్రజలను సమీకరించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఏప్రిల్‌ నెలలో కూడా ప్రధాని రెండుసార్లు రాష్ట్రాన్ని పర్యటిస్తారని ఇందుకు సంబంధించిన కార్యక్రమాలను పీఎంఓ ఇంకా కార్యాలయం ఖరారు చేయలేదని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు శనివారం మీడియాకు తెలిపారు.

Updated Date - 2023-02-26T15:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising