ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bangalore Amit Shah House: బెంగళూరులో అమిత్‌షా కోసం ఇల్లు చూస్తున్నారు.. ఎందుకంటే..

ABN, First Publish Date - 2023-02-26T12:42:43+05:30

కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా కొన్నిరోజుల పాటు ఇక్కడే మకాం వేయదలచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కోసం ప్రత్యేకంగా ఓ నివాసాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు (Karnataka Assembly Elections 2023) సమీపిస్తున్న సందర్భంగా కొన్నిరోజుల పాటు ఇక్కడే మకాం వేయదలచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Home Minister Amit Shah) కోసం ప్రత్యేకంగా ఓ నివాసాన్ని సిద్ధం చేస్తున్నారు. మే నెల మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో మార్చి నెలాఖరుకు నోటిఫికేషన్‌ (Karnataka Elections Notification) జారీ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎన్నికల వేళ తరచూ ఢిల్లీ నుంచి బెంగళూరు (Delhi to Bangalore) లేదా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉన్నందున అమిత్‌షా కోసం బెంగళూరులో ప్రత్యేకంగా ఓ నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదే నివాసంలోనే కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా ఉండేలా సిద్ధం చేస్తున్నారు.

ఇదే విషయమై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అశోక్‌ బాగల్‌కోటెలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని మరోసారి తీసుకువచ్చేందుకు అమిత్‌షా బెంగళూరులోనే కొంతకాలం ఉంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తరహాలో అలా సభలు పెట్టి ప్రసంగాలు కుప్పించి పరుగులు తీసే పార్టీ కాదన్నారు. కాగా 2018 శాసనసభ ఎన్నికల వేళ కూడా అమిత్‌షా కొన్నిరోజుల పాటు బెంగళూరులోనే గడిపారు. చాళుక్య సర్కిల్‌లోని ఓ నివాసంలో దాదాపు నెలరోజుల పాటు ఉంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. నిరంతరం రాష్ట్ర నేతలతో సమీక్షలు జరిపి ఎప్పటికప్పుడు రాజకీయంగా పార్టీలోని అన్ని వర్గాలను అప్రమత్తం చేశారు. అదే తరహాలోనే మరోసారి బెంగళూరు నుంచే కొన్ని రోజుల పాటు వ్యవహారాలు చక్కదిద్దేందుకు అమిత్‌షా సిద్ధమవుతున్నారు.

Updated Date - 2023-02-26T15:09:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising