ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka: కర్ణాటక సీఎం బొమ్మైకి తృటిలో తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2023-04-13T18:08:00+05:30

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన సతీ సమేతంగా

Basavaraj Bommai
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఉడుపి : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Karnataka Chief Minister Basavaraj Bommai)కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన సతీ సమేతంగా ప్రయాణించిన హెలికాప్టర్ ఫ్యాన్‌ మంటల్లో చిక్కుకుంది. అయితే అంతకుముందు వారిద్దరూ ఆ హెలికాప్టర్ నుంచి దిగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఆ మంటలను ఆర్పేశారు.

బసవరాజ్ బొమ్మై, ఆయన సతీమణి కలిసి గురువారం ప్రయాణించిన హెలికాప్టర్ ఆరెషిరూర్ హెలిప్యాడ్‌లో దిగింది. వారిరువురు కాన్వాయ్‌లో కొల్లూరులోని మూకాంబిక అమ్మవారి దేవాలయానికి వెళ్లి, పూజలు చేశారు. వారి కాన్వాయ్ బయల్దేరిన కాసేపటికి హెలికాప్టర్ ఫ్యాన్ మంటల్లో చిక్కుకుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించి, మంటలను ఆర్పేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఇదిలావుండగా, ‘కాంతార’ ఫేమ్ రిషభ్ షెట్టి ఈ దేవాలయం వద్ద బొమ్మైని కలిశారు. బొమ్మైకి పాదాభివందనం చేశారు. దీంతో రిషభ్ బీజేపీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉందనే ఊహాగానాలకు తెర లేచింది.

ఇవి కూడా చదవండి :

Congress : రాహుల్ గాంధీ అపీలుపై విచారణ

Siachen Day: సియాచిన్ డే.. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో భారత సైన్యం ఘన విజయానికి గుర్తు..

Updated Date - 2023-04-13T18:08:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising