Karnataka Elections: బళ్లారి జేడీఎస్ అభ్యర్థిని ప్రకటించిన మాజీ సీఎం
ABN, First Publish Date - 2023-03-25T11:49:18+05:30
జేడీఎస్ బళ్లారి నగర ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీలో సీనియర్ మైనార్టీ నాయకుడు మున్నాబాయ్(Munnabai)ని జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి(Former CM Kumaraswamy)
బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): జేడీఎస్ బళ్లారి నగర ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీలో సీనియర్ మైనార్టీ నాయకుడు మున్నాబాయ్(Munnabai)ని జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి(Former CM Kumaraswamy) శుక్రవారం ప్రకటించారు. కుమారస్వామే స్వయంగా మున్నాబాయ్‌కి ఫోన్ చేసి బెంగళూరుకు రమ్మని ఆహ్వానించినట్లు కార్యకర్తలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బళ్లారి నుంచి సుమారు 50 వాహనాల్లో జేడీఎస్ కార్యకర్తలు బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. మున్నాబాయ్ ముస్లీం మైనార్టీ నాయకుడు, గత 16 సంవత్సరాలుగా జేడీఎస్(JDS) పార్టీలో ఉన్నారు. 2013 విధానసభ ఎన్నికల్లో పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తరువాత మారిన రాజకీయ పరిస్థితుల తో చాలా మంది నాయకులు పార్టీని వదిలి వేరే పార్టీతో చేతులు కలిపినా మున్నాబాయ్ ఇదేపార్టీలో కొనసాగుతూ ఉన్నారు. 2018లో మాజీ ప్రధాని దేవేగౌడ బళ్లారికి వచ్చినప్పుడు మున్నాబాయ్ ఇంటికి వచ్చి అక్కడే ఒక రోజు రాత్రి కూడా బస చేశారు. దేవేగౌడ, కుమారస్వామి, లాంటి నాయకులతో మున్నాబాయ్‌కి ముందు నుంచి మంచి పరిచయాలు ఉన్నాయి. పార్టీలో విధేయుడుగా ఉన్న మున్నాబాయ్‌కే బళ్లారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పలువురు జేడీఎస్ నాయకులు కూడా ఆయనకు మద్దతు ఇచ్చారు. వాస్తవానికి ఆర్థికంగా తన పరిస్థితి అంత బాగలేదని నేను పోటీ చేయలేనని మున్నాబాయ్ పార్టీ కార్యకర్తలతోనూ పార్టీ నాయకులతో వివరించినా ఇందుకు పార్టీ కార్యకర్తలు కూడా మేము నీకోసం చందాలు వేసుకుని ఆర్థికంగా మద్దతు ఇస్తామని మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. మాజీ సీఎం కుమారస్వామి కూడా మున్నాబాయ్‌కి అన్నిరకాలుగా మద్దతుగా ఉంటాను..పోటీ చేయాలని కోరినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌లో గడగడ..
జేడీఎస్ పార్టీ తమ అభ్యర్థిగా మైనార్టీ నాయకుడు మున్నాబాయ్‌ని ప్రకటించడంతో కాంగ్రెస్‌లో ఆందోళన మొదలయ్యింది. మైనార్టీ ఓట్లపై గంపెడు ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఓట్లు చీలిపోతాయన్న భయం పట్టుకుంది. జేడీఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు నష్టం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మున్నాబాయ్(Munnabai) ఎవరికి పోల్ అయ్యే ఓట్లు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇది ఇలా ఉంటే జేడీఎస్ లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్, కేఆర్‌పీపీ, ఆఫ్, ఇతర ఇండిపెండెంట్లు ఎలాగూ ఉంటారు కాబట్టి ఈసారి బళ్లారిలో జేడీఎస్ సత్తా చాటుదుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నగరంలో తొలి టికెట్ ఖరారు అయినట్లయ్యింది.
Updated Date - 2023-03-25T11:49:50+05:30 IST