Karnataka Elections: కాంగ్రెస్‌లో చేరాక రాహుల్‌తో శెట్టర్ ఫస్ట్ మీట్.. ఆసక్తికర పరిణామం
ABN, First Publish Date - 2023-04-23T16:53:27+05:30
నిన్న మొన్నటిదాకా బీజేపీలో ఉండి రాహుల్ గాంధీని తీవ్రంగా విమర్శించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ నేడు ఆయనతోటే తొలిసారి భేటీ అయ్యారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ మరో ఆసక్తికర పరిణామం జరిగింది. నిన్న మొన్నటిదాకా బీజేపీలో ఉండి రాహుల్ గాంధీని(Rahul Gandhi) తీవ్రంగా విమర్శించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ (Jagdish Shettar) నేడు ఆయనతోటే తొలిసారి భేటీ అయ్యారు. తొలుత హుబ్బళి విమానాశ్రయానికి తన అనుచరులతో స్వయంగా వెళ్లిన శెట్టర్... రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరు నేతలూ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. కర్ణాటకలో తాజా పరిస్థితులనుంచి మొదలుకొని అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల వరకూ చర్చించారు. సమావేశం తర్వాత శెట్టర్ మీడియాతో మాట్లాడారు. అనేక అంశాలపై చర్చించామన్నారు. బీజేపీ తనపట్ల అనుచితంగా ప్రవర్తించిందని, అందుకే మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో చేరానన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రాహుల్‌తో కీలక విషయాలన్నింటినీ చర్చించానన్నారు. వాస్తవానికి రాహుల్-శెట్టర్ భేటీని రాజకీయ పార్టీల నేతలతో పాటు రాజకీయ పరిశీలకులు కూడా ఆసక్తిగా గమనించారు. సుదీర్ఘ కాలం బీజేపీలో సేవలందించి ఎన్నికల వేళ పార్టీ మారిన శెట్టర్.. రాహుల్‌తో ఏం చర్చించి ఉంటారని చెవులు కొరుక్కుంటున్నారు.
హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ సీట్ (Hubli Dharwad Central seat) నుంచి శెట్టర్ తలపడుతున్నారు. తనకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో బీజేపీ అధిష్టానంపై ఆయన తిరుగుబాటు చేసి బయటకు వచ్చారు. ఆరుసార్లుగా ఓటమి ఎరుగరు. సర్వేలన్నీ తానే గెలుస్తున్నట్లు వెల్లడించాయని, అయినా బీజేపీ తనకు టికెట్ ఎందుకీయలేదని శెట్టర్ వాపోయారు. ఇదే విషయంపై ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ( BJP national president JP Nadda) సమావేశమై చర్చించారు. అయినా శెట్టర్‌కు టికెట్ లభించకపోవడంతో కాంగ్రెస్ పంచన చేరారు. 67 ఏళ్ల వయసులో శెట్టర్ పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరాల్సి వచ్చింది. ఆ తర్వాత తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ సీట్ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగారు.
శెట్టర్ శిష్యుడైన యువ నాయకుడు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేశ్‌ని (Mahesh Tenginkai) బీజేపీ హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ సీట్ నియోజకవర్గం నుంచి రంగంలోకి దించింది. ఇద్దరూ లింగాయత్ నేతలే కావడంతో పోటీపై ఆసక్తి నెలకొంది. వాస్తవానికి హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ సీట్ నుంచి గత ఎన్నికల్లో శెట్టర్ గెలిచారు.
కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
Karnataka Elections: పొత్తు లేకున్నా మద్దతిస్తాం.. ఎందుకంటే?
Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ల భార్యలకు ప్రాణభయం..
TMC Vs BJP: జాతీయ హోదాపై అమిత్‌షాకు మమత ఫోన్?
Karnataka Assembly Elections: ముఖ్యమంత్రికి మాటిచ్చి నిలబెట్టుకున్న కిచ్చా సుదీప్
Updated Date - 2023-04-23T17:13:18+05:30 IST