ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు పండుగలాంటి వార్త

ABN, First Publish Date - 2023-05-30T19:08:15+05:30

కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సిద్ధరామయ్య సారథ్యంలోని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం పండుగలాంటి వార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరవు భత్యాన్ని 31 శాతం నుంచి 35 శాతానికి పెంచుతున్నట్టు మంగళవారంనాడు ప్రకటించింది. 2023 జనవరి 1 నుంచి ఈ కరవు భత్యం వర్తింపజేస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక (Karnataka) ప్రభుత్వ ఉద్యోగులు (Government Employees), పెన్షనర్లకు (Pensioners) సిద్ధరామయ్య (Siddaramaiah) సారథ్యంలోని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం పండుగలాంటి వార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరవు భత్యాన్ని (Dearness Allowance) 31 శాతం నుంచి 35 శాతానికి పెంచుతున్నట్టు మంగళవారంనాడు ప్రకటించింది. 2023 జనవరి 1 నుంచి ఈ కరవు భత్యం వర్తింపజేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు, జిల్లా పంచాయతీ ఉద్యోగులు, రెగ్యులర్ టైమ్ స్కేల్ పే వర్క్-చార్జ్‌డ్ ఉద్యోగులు, ఎయిడెంట్ విద్యాసంస్థలు, యూనివర్శిటీలోని ఫుల్‌టైమ్ ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ బొనంజా ప్రకటించడం విశేషం.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో గృహజ్యోతి పథకం కింద గృహావసరాల కోసం వినియోగించే విద్యుత్‌ను 200 యూనిట్ల వరకూ ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. గృహలక్ష్మి పథకం కింద ఇంటిపెద్దగా ఉన్న మహిళలకు నెలసరి రూ.2,000 ఆర్థిక సాయం, అన్నభాగ్య కింద బీపీఎల్ హౌస్‌హోల్డ్‌ సభ్యులకు పది కిలోల చొప్పున ఉచిత బియ్యం, యువనిధి కింద 18-25 ఏళ్ల లోపు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.2,000, నిరుద్యోగ డిప్లమో హోల్డర్లకు రూ.1,500, శక్తి పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలు ఇచ్చింది. ఈ హామీల అమలుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆర్థిక, రవాణా, ఆహార పౌరసరఫరాలు, విద్యుత్ తదితర శాఖల సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. పథకాల అమలుకు సంబంధించిన నివేదిక తయారు చేయాల్సిందిగా వారిని ఆదేశించారు. వచ్చే గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో హామీల అమలుపై అధికారికంగా నిర్ణయం తీసుకుంటారు.

Updated Date - 2023-05-30T19:08:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising