Facebook : ఫేస్‌బుక్‌ను హెచ్చరించిన కర్ణాటక హైకోర్టు
ABN, First Publish Date - 2023-06-15T15:25:07+05:30
సామాజిక మాధ్యమాల్లో దిగ్గజం వంటి ఫేస్‌బుక్ (facebook)ను కర్ణాటక హైకోర్టు (Karnataka high court) బుధవారం గట్టిగా హెచ్చరించింది. సౌదీ అరేబియా జైలులో ఉన్న భారతీయుడికి సంబంధించిన కేసు దర్యాప్తులో దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసింది. భారత దేశంలో కార్యకలాపాలు నిర్వహించకుండా నిరోధిస్తూ ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది.
బెంగళూరు : సామాజిక మాధ్యమాల్లో దిగ్గజం వంటి ఫేస్‌బుక్ (facebook)ను కర్ణాటక హైకోర్టు (Karnataka high court) బుధవారం గట్టిగా హెచ్చరించింది. సౌదీ అరేబియా జైలులో ఉన్న భారతీయుడికి సంబంధించిన కేసు దర్యాప్తులో దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసింది. భారత దేశంలో కార్యకలాపాలు నిర్వహించకుండా నిరోధిస్తూ ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది.
కర్ణాటకలోని మంగళూరువాసి కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ ధర్మాసనం విచారణ జరుపుతోంది. కోరిన సమాచారంతో పూర్తి నివేదికను ఓ వారంలోగా కోర్టుకు సమర్పించాలని ఫేస్‌బుక్‌ను ఆదేశించింది.
భారత పౌరుడిని అన్యాయంగా సౌదీ అరేబియాలో అరెస్టు చేసిన నేపథ్యంలో తీసుకున్న చర్యలేమిటో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ఆదేశించింది. విదేశీ గడ్డపైన జైలులో మగ్గిపోతున్న వ్యక్తికి న్యాయ సహాయం అందిస్తున్నారా? లేదా? తెలియజేయాలని తెలిపింది. అంతర్జాతీయ క్రిమినల్ చట్టాల ప్రకారం దర్యాప్తు న్యాయంగా జరుగుతోందా? లేదా? తెలియజేయాలని కోరింది.
మంగళూరుకు చెందిన శైలేష్ కుమార్ సౌదీ రాజును, ఇస్లాంను అవమానిస్తూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టారని ఆరోపిస్తూ సౌదీ అరేబియా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన సతీమణి కవిత 2021లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త శైలేష్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని, ఫేక్ ప్రొఫైల్‌తో అభ్యంతకరమైన మెసేజ్‌లను ఎవరో పోస్ట్ చేశారని ఆరోపించారు. తన భర్త 25 సంవత్సరాల నుంచి సౌదీ అరేబియాలో పని చేస్తున్నారని తెలిపారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరుల జాబితా (NRC)లకు అనుకూలంగా పోస్ట్ పెట్టారని, అనంతరం ఆయనకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారని తెలిపారు. ఆ తర్వాత ఆయన తన పోస్ట్‌ను డిలీట్ చేశారన్నారు. ఆయన పేరు మీద వేరొకరు ఫేక్ అకౌంట్‌ను క్రియేట్ చేసి, సౌదీ రాజును, ఇస్లాంను అవమానిస్తూ పోస్టు పెట్టారన్నారు. ఈ నేపథ్యంలో తన భర్త కుమార్‌ను అరెస్ట్ చేసి, విచారణ జరిపారని, 15 ఏళ్ల జైలు శిక్ష విధించారని తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు తాను ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
హైకోర్టు మంగళూరు పోలీసు కమిషనర్‌కు జూన్ 12న ఇచ్చిన ఆదేశాల్లో ఈ కేసు గురించి పూర్తిగా అధ్యయనం చేసి, కోర్టుకు హాజరుకావాలని తెలిపింది. దర్యాప్తు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం ఎందుకు జరుగుతోందో తెలియజేయాలని ఆదేశించింది. ఓ భారత పౌరుడి ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయినట్లు నిర్దిష్టమైన ఆరోపణ వచ్చినపుడు, ఆ పౌరుడిపై విదేశీ గడ్డపై విచారణ జరిగి, దోషిగా నిర్థరణ అయి, జైలులో మగ్గిపోతున్నపుడు దర్యాప్తు పూర్తికావడంలో తీవ్ర జాప్యానికి కారణాలేమిటో వివరించాలని తెలిపింది.
మంగళూరు నగర పోలీసు కమిషనర్ కుల్దీప్ కుమార్ జైన్ జూన్ 14న కోర్టుకు హాజరై, దర్యాప్తునకు ఫేస్‌బుక్ సహకరించకపోవడం వల్ల దర్యాప్తు ఆలస్యమవుతోందని చెప్పారు. ఫేస్‌బుక్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది మాట్లాడుతూ, ఖాతా హ్యాక్ ఎక్కడ జరిగిందో కచ్చితమైన సమాచారం తమ వద్ద లేదని హైకోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దర్యాప్తునకు సహకరించకపోతే, ఫేస్‌బుక్ కార్యకలాపాలను భారత దేశంలో మూసివేయించేందుకు ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి :
Kolkata Airport : కోల్‌కతా విమానాశ్రయంలో స్వల్ప అగ్ని ప్రమాదం
Updated Date - 2023-06-15T15:25:07+05:30 IST