Karnataka : రైతులకు సాయపడేందుకే పాల ధర పెంపు : డీకే శివ కుమార్
ABN, First Publish Date - 2023-07-28T11:49:51+05:30
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఉచిత పథకాల హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్ క్రమంగా ధరల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. తాజాగా నందిని పాల ధరను లీటరుకు రూ.3 చొప్పున పెంచింది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో, ఈ పెంపుదలను ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ గట్టిగా సమర్థిస్తున్నారు.
బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఉచిత పథకాల హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్ క్రమంగా ధరల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. తాజాగా నందిని పాల ధరను లీటరుకు రూ.3 చొప్పున పెంచింది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో, ఈ పెంపుదలను ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ (Deputy Chief Minister DK Shivakumar) గట్టిగా సమర్థిస్తున్నారు. రైతులకు సాయపడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు.
రైతులకు డబ్బు ఇవ్వాలని, దేశవ్యాప్తంగా పాల ధర రూ.50 నుంచి రూ.56 వరకు ఉందని, కర్ణాటకలో మాత్రమే చాలా తక్కువగా ఉందని తెలిపారు. రూ.3 పెంచి, రైతులకు సాయపడాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో నందిని వర్సెస్ అమూల్ అంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. గుజరాత్‌కు చెందిన అమూల్ కర్ణాటకలో పాలను సేకరించి, అమ్మడానికి ప్రయత్నిస్తోందని, కర్ణాటకకు చెందిన ‘నందిని’ పాలను దెబ్బతీయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది. అమూల్ కర్ణాటకలో అడుగు పెడితే, రాష్ట్రంలోని నందిని బ్రాండ్ దెబ్బతింటుందని ప్రచారం చేసింది. నందిని పాల యాజమాన్య సంస్థ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్.
ఇవి కూడా చదవండి :
Manipur : మణిపూర్ వీడియో లీకేజ్ వెనుక కుట్ర : అమిత్ షా
Updated Date - 2023-07-28T11:50:58+05:30 IST