ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka: హస్తినకు చేరిన కర్ణాటక పంచాయితీ..

ABN, First Publish Date - 2023-05-15T16:11:45+05:30

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో తలెత్తిన ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ఎంపిక నిర్ణయం అధిష్ఠానానికి అప్పగిస్తూ సీఎల్‌పీ సింగిల్ లైన్ తీర్మానం చేయడంతో సీను ఢిల్లీకి మారింది. సీఎం రేసులో ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అభిమానుల సందడి మధ్య బెంగళూరులోని తన నివాసం నుంచి ఢిల్లీకి బయలుదేదారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) ఎవరనే విషయంలో తలెత్తిన ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ఎంపిక నిర్ణయం అధిష్ఠానానికి అప్పగిస్తూ సీఎల్‌పీ (CLP) సింగిల్ లైన్ తీర్మానం చేయడంతో సీను ఢిల్లీకి మారింది. సీఎం రేసులో ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అభిమానుల సందడి మధ్య బెంగళూరులోని తన నివాసం నుంచి ఢిల్లీకి బయలుదేదారు.

మరోవైపు సీఎం రేసులో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) ఈరోజు తన పుట్టినరోజును జరుపుకొంటున్నారు. తన కర్తవ్యం తాను నిర్వహించానని, నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ అధిష్ఠానమేనని సీఎం ఎంపికపై ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ వెళ్లాలని తాను ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. సీఎల్‌పీ సింగిల్ లైన్ తీర్మానం చేసినందున అధిష్ఠానమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

ఖర్గేకు నివేదిక: జితేంద్ర సింగ్

కాగా, సీఎల్‌పీ సమావేశంలో చేసిన తీర్మానం, ఎమ్మెల్యేల అభిప్రాయాల సేకరణతో కూడిన నివేదికతో కర్ణాటక ఏఐసీసీ పరిశీలకులు సుశీల్ కుమార్ కుమార్ షిండే, దీపక్ బవరియా, బన్వర్ జితేంద్ర సింగ్ సైతం ఢిల్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలతో ఆదివారం రాత్రి 4-5 గంటలు తాము సమావేశమయ్యాయమని, వారి అభిప్రాయలను తీసుకున్నామని ఢిల్లీ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ బన్వర్ జితేంద్ర సింగ్ తెలిపారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌కు నివేదిక అందజేస్తామని తెలిపారు. కాగా, పార్టీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందు నుంచి బెంగళూరులోనే క్యాంప్ చేసిన కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ, కేంద్ర పరిశీలకులు తమ నివేదకను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పిస్తారని, త్వరలోనే కర్ణాటకలో తాము (కాంగ్రెస్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Updated Date - 2023-05-15T16:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising