ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kaveri water: కర్ణాటకకు షాక్‌ ఇచ్చిన సీడబ్ల్యుఆర్‌సీ.. తమిళనాడుకు రోజూ 5వేల క్యూసెక్కులు

ABN, First Publish Date - 2023-08-29T10:53:49+05:30

తమిళనాడుకు రోజూ 5వేల క్యూసెక్కుల చొప్పున 15 రోజులపాటు నీటిని విడుదల చేయాలని కర్ణాటక(Karnataka) ప్రభుత్వానికి

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): తమిళనాడుకు రోజూ 5వేల క్యూసెక్కుల చొప్పున 15 రోజులపాటు నీటిని విడుదల చేయాలని కర్ణాటక(Karnataka) ప్రభుత్వానికి కావేరి నీటి నియంత్రణ కమిషన్‌ (సీడబ్ల్యుఆర్‌సీ) సిఫారసు చేసింది. కావేరి జల వివాదంపై సోమవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈమేరకు తీర్మానించారు. ప్రతిరోజూ తమిళనాడుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సూచించారు. ప్రస్తుతం తమిళనాడు(Tamil Nadu)కు రోజూ 1900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం నుంచి 5వేలకు పెంచాలని సూచించారు. అంటే 3,100 క్యూసెక్కుల నీటిని అదనంగా విడుదల చేయాల్సి ఉంటుంది. కావేరి నీటి కేటాయింపులపై కీలక సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాల అధికారులు భాగస్వామ్యులయ్యారు. తమిళనాడు 5వేల క్యూసెక్కుల విడుదల చేయాలని డిమాండ్‌ చేయగా కర్ణాటక తరపు అధికారులు 3వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేయగలమని వాదించారు. కానీ కావేరి నియంత్రణ కమిషన్‌ 5వేల క్యూసెక్కుల విడుదల చేయాలని సూచించింది. మంగళవారం కావేరి నీటి నియంత్రణ మండలి నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఇక్కడి తీర్మానమే కీలకం కానుంది. సీడబ్యుఆర్‌సీ సూచనలపై కర్ణాటక ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

Updated Date - 2023-08-29T10:53:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising