Kavery dispute: కావేరి జలాల విడుదల కోసం రైతుల రైలురోకో
ABN, First Publish Date - 2023-10-03T10:03:03+05:30
డెల్టా జిల్లాలకు కావేరి జలాలను విడుదల చేయకుండా మొండి వైఖరిని అవలంబిస్తున్న కర్ణాటక(Karnataka) ప్రభుత్వాన్ని, ఈ వివాదంలో
- వందమంది అరెస్టు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): డెల్టా జిల్లాలకు కావేరి జలాలను విడుదల చేయకుండా మొండి వైఖరిని అవలంబిస్తున్న కర్ణాటక(Karnataka) ప్రభుత్వాన్ని, ఈ వివాదంలో ఎలాంటి చర్యలు చేపట్టక నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కేంద్రప్రభుత్వ తీరును ఖండిస్తూ నాగపట్టినం జిల్లా కీళ్‌వేలూరులో రైతు సంఘాల ఆధ్వర్యంలో రైలురోకో నిర్వహించారు. సోమవారం ఉదయం సుమారు వందమంది రైతులు అక్కడి రైల్వేస్షేషన్‌లో చొరబడి తిరుచ్చికి వెళుతున్న ప్యాసింజర్ రైలు(Passenger train)ను అడ్డుకున్నారు. ఆ సందర్భంగా కర్ణాటక, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన చేస్తున్న రైతులను అక్కడి నుండి తొలగించేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగించారు. రైతులంతా పట్టాలపై బైఠాయించడంతో పోలీసులు అందరిని అరెస్టు చేసి వ్యాన్‌లలో ఎక్కించి తరలించారు. ఈ సంఘటన కారణంగా కీళ్‌వేలూరు రైల్వేస్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.
Updated Date - 2023-10-03T10:03:03+05:30 IST